Home / ANDHRAPRADESH / రివర్స్ టెండరింగ్‌పై పచ్చపత్రికలో అసత్యకథనాలు..మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఫైర్…!

రివర్స్ టెండరింగ్‌పై పచ్చపత్రికలో అసత్యకథనాలు..మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ ఫైర్…!

చంద్రబాబు సర్కార్ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీఎం జగన్ రివర్స్ టెండరింగ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. పోలవరం ప్రాజక్టు నిర్మాణంలో హెడ్‌ వర్క్స్, హైడల్ ప్రాజెక్టు పనులలో ప్రధాన కాంట్రాక్టు సంస్థ అయిన నవయుగను తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. పోలవరం ప్రధాన డ్యామ్‌లో మిగిలి ఉన్న పనికి రూ.1771. 44 కోట్ల విలువతో పార్ట్ ఏ గా, పోలవరం హైడల్ ప్రాజెక్టుకు రూ.3216.11 కోట్ల అంచనా విలువతో పార్టు బిగా రాష్ట్ర జలవనరుల శాఖ సంయుక్తంగా టెండర్లు పిలిచింది. సెప్టెంబర్ వరకు బిడ్లు దాఖలు చేసేందుకు గడవు పెట్టింది. అయితే తాజాగా చంద్రబాబుకు తస్మదీయుడైన ఓ మీడియాధిపతికి చెందిన పత్రిక.. నవయుగ సంస్థను సమర్థిస్తూ…పోలవరం పనుల్లో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడాన్ని తప్పు పట్టింది. గతంలో వేర్వేరు పనులకు వేర్వేరు టెండర్లు పిలిచారని…ఇప్పుడు వేర్వేరు పనులకు ఒకే టెండర్ పిలవడం ఏంటీ..పోలవరం ప్రధాన ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇస్తుండగా..హైడల్ ప్రాజెక్టుకు ఏపీ జెన్‌కో డబ్బులు ఇస్తుందని..ఇప్పుడు వేర్వేరు పనులకు ఒకే టెండర్ పిలవడం వలన ఒక ప్రాజెక్టు భారాన్ని మరో ప్రాజెక్టుకు బదిలీ చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమంటూ..ఇదేం రివర్స్ టెండరింగ్ …కేవలం అస్మదీయులకు అప్పగించేందుకునే..? అంటూ సదరు పత్రిక ఓ కథనం ప్రచురించింది.

తాజాగా ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ సదరు పత్రిక ప్రచురించిన అసత్య కథనంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం పార్టీకి ఏటీఎంగా మారిందని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే చెప్పారు. ఇదే విషయాన్ని మంత్రి ప్రస్తావిస్తూ… పోలవరంలో అవినీతికి కారణమైన అదే కాంట్రాక్టర్‌కు పోలవరం కాంట్రాక్టులను కొనసాగించాలని, ఇదేం రివర్స్ టెండరింగ్ అంటూ నిపుణులు వాపోతున్నారంటూ.. సదరు పత్రిక వాదిస్తోందంటే ఇది పాఠకులతో బాంధవ్యం కాదని, నవయుగానుబంధం అన్నది స్పష్టమవుతోందంటూ.. తీవ్రంగా ఆక్షేపించారు. కాగా హెడ్‌ వర్క్స్, జల విద్యుత్‌ కేంద్రం పనులను వేర్వేరుగా కాంట్రాక్టర్లకు అప్పగించాలన్నది రూల్‌ అన్నట్లు ఆ కథనంలో రాశారని, ఈ రెండు పనులు ఇంతకు ముందు చంద్రబాబుకు వంతపడే పత్రికాధిపతికి చెందిన అస్మదీయ కంపెనీయే ఎక్కువ రేటుకు టెండర్‌ దక్కించుకుందన్న నిజం… ఆ పత్రిక పాఠకులకు తెలియదన్న ధీమాకు జోహార్లు అర్పిస్తున్నామంటూ మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. కాగా ప్రభుత్వం పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళితే..ఏదో వారి బంధువుల కంపెనీ కాంట్రాక్టు రద్దు అయినందుకు నిపుణులు బాధ పడుతున్నారని ఆ కథనంలో రాశారని, కాని ఆ నిపుణులు ఎవరో ప్రస్తావించలేదని మంత్రి విమర్శించారు. పోలవరం నిర్మాణం నుంచి వైదొలగిన నవయుగ కంపెనీకి, చంద్రబాబుకు తస్మదీయుడైన ఓ పత్రికాధిపతి కుటుంబంతో ఉన్న బంధం.. బంధుత్వం ఈ అసత్య కథనం రాయడానికి.. ప్రచురణకు ప్రేరేపించిందని ఆరోపించారు. ఈ విషయం సదరు పత్రిక పాఠకులకు తెలియాలన్న ఉద్దేశంతోనే సంబంధిత శాఖ మంత్రిగా వివరణ ఇస్తున్నానని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మొత్తంగా పోలవరం ప్రాజెక్టులో ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు వెళితే బాబుగారికి ఆత్మీయుడైన ఓ ఎల్లోమీడియాధిపతికి చెందిన పత్రికలో నవయుగ సంస్థనే కొనసాగించాలంటూ రాసిన కథనాల వెనుక…ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్‌ను గుడ్డిగా వ్యతిరేకించాలనే దురుద్దేశమే తప్పా..మరొకటి లేదని..అర్థమవుతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat