Home / ANDHRAPRADESH / ఆ విద్యార్ధి మరణం మీ పాలిట శాపమే…తల్లితండ్రులు ఇకనైనా మేలుకోవాలి !

ఆ విద్యార్ధి మరణం మీ పాలిట శాపమే…తల్లితండ్రులు ఇకనైనా మేలుకోవాలి !

ప్రస్తుత రోజుల్లో విద్యార్ధులు చదువుకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరికి తెలిసిందే. ఎంత ఎక్కువ చదివితే అంతా జ్ఞానం వస్తుందని పోటాపోటీగా చదువుతున్నారు. ఇందులో అమ్మాయిలు అయితే అబ్బాయిలు కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని చెప్పాలి. ర్యాంకులు పరంగా, ఉద్యోగాల పరంగా ఈరోజుల్లో అమ్మాయిలే ముందంజులో ఉన్నారు. ఇలా అమ్మాయిలకు తల్లితండ్రులు ఎంత ప్రోత్సాహం ఇస్తే అంత ఎత్తుకు ఎదుగుతారు. కాని మరోపక్క ఆడపిల్లకు చదువెందుకు అనే మూర్కపు ఆలోచనలతో కొందరు పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. అవి ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి సంఘటనే ఒకటి ఇప్పుడు కర్నూల్ జిల్లలో జరిగిగింది. చదువు ఆపేసి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఆత్మహత్యా చేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. కర్నూల్ జిల్లా అంక్కిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన బొంతల నరసింహరెడ్డి,అంకాళమ్మ దంపతుల కుమార్తె లక్ష్మి(18). ఈమె తాడిపత్రిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. కూతురు చదువుకుంటానని ఎంత చెప్పినా పట్టించుకోకుండా తల్లితండ్రులు అనంతపురం జిల్లా  పుట్లూరు మండలంకి చెందిన 39 ఏళ్ల వ్యక్తితో పెళ్లి నిశ్చయించారు. ఇంక ఇంట్లో వాళ్ళు పెళ్లి పనుల్లో బిజీగా ఉండడంతో ఎవరికీ తెలియకుండా బుధవారం మధ్యాహ్నం ఇంటినుండి వెళ్ళిపోయింది. ఇంట్లో వాళ్ళు ఎంత వెతికినా దొరకలేదు. చివరికి గురువారం ఉదయం బట్టలు రేవులో రజకులకు లక్ష్మి మృతదేహం కనిపించింది. దాంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారి బలవంతం వల్ల కన్నా కూతురిని చంపుకున్నారు.