Home / ANDHRAPRADESH / హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపానని బిల్డప్ ఇచ్చే బాబు అమరావతిని ఇండియా మ్యాప్‌‌లో కూడా లేకుండా చేశాడుగా..!

హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపానని బిల్డప్ ఇచ్చే బాబు అమరావతిని ఇండియా మ్యాప్‌‌లో కూడా లేకుండా చేశాడుగా..!

టీడీపీ అధినేత చంద్రబాబు పొద్దున లేస్తే సందర్భం కూడా లేకుండా పదే పదే నవ్వుకుంటారనే ఇంగిత జ్ఞానం లేకుండా హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపానని గొప్పలు చెప్పకుంటాడు. విభజన తర్వాత అమరావతిని సింగపూర్‌ను తలదన్నేలా ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు. తీరా బాబుగారు అధికారంలోకి వచ్చాక..స్పెషల్ ఫ్లైట్లలో విదేశాలు తిరిగి, ఆ డిజైన్లు, ఈ డిజైన్లు అని తిప్పి తిప్పి, సినీ డైరెక్టర్ రాజమౌళి డిజైన్లను కూడా పక్కనపెట్టి ఆఖరికి ఓ ఇడ్లీ పాత్ర డిజైన్‌ను అదీ పదవి నుంచి దిగిపోయేముందు ఓకే చేసాడు. అయితే బాబుగారు అమరావతిలో ఐదేళ్లలో కట్టించింది మూడు తాత్కాలిక భవనాలు అవీ చిన్నవర్షం పడితే కురిసే భవనాలు. ఇదీ బాబుగారి రాజధాని నిర్మాణంలో డొల్ల. కాగా బాబుగారి పుణ్యమాని ఇప్పుడు రాజధాని లేని నగరంగా ఆంధ్ర ప్రదేశ్‌కు దిక్కుమాలిన పరిస్థితి వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇండియా పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఈ మ్యాప్‌లో దేశంలోని కొత్తగా ఏర్పడిన జమ్ము, లడఖ్‌లతో సహా మొత్తం 29 రాష్ట్రాలు, తొమ్మిది కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానులను పొందుపరిచింది. అయితే ఈ పొలిటికల్ మ్యాప్‌లో అమరావతికి చోటు దొరకలేదు. ఇండియా మ్యాప్‌లో రాజధాని లేని నగరంగా ఏపీ మిగిలిపోవడం యావత్ ఆంధ్రులకు అవమానకరం. ఈ విషయంపై బీజేపీ నాయకులు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపానని గొప్పలు చెప్పుకొన్న చంద్రబాబు నాయుడు.. ఏపీ రాజధాని పట్ల పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అంతర్జాతీయ స్థాయిలో అమరావతిని నిర్మిస్తామని విదేశాలు తిరుగుతూ..గ్రాఫిక్స్ డిజైన్ల పేరుతో డ్రామాలు ఆడారని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి‌లు ఘాటైన విమర్శలు చేశారు. నమ్మినవారిని మోసం చేయడం చంద్రబాబు సహజగుణమని వారు ఘాటుగా విమర్శించారు. 2014 నాటి ఎన్నికల ప్రచారంలో సింగపూర్ తరహా రాజధానిని నిర్మిస్తామని ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్లపాటు గ్రాఫిక్స్ డిజైన్లు చూపిస్తూ..ఇదే ప్రపంచస్థాయి రాజధాని అంటూ రాష్ట్ర ప్రజలకుయ దారుణంగా వెన్నుపోటు పొడిచారని బీజేపీ నేతలు మండిపడ్డారు. మొత్తంగా ఇండియామ్యాప్‌‌లో రాజధాని లేని నగరంగా ఏపీ మిగిలపోయే దుస్థితికి చంద్రబాబే కారణమని చెప్పకతప్పదు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat