Home / ANDHRAPRADESH / సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..!

సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో చెప్పిన దాని ప్రకారం అన్ని హామీలను అమలు పంచుకుంటూ పోతున్న జగన్ మద్యపాన నిషేధం కూడా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఎక్కడ 8 తర్వాత మద్యం దొరకడం లేదు. ఇప్పటికే ఉన్న మద్యం షాపులను సగానికి సగం వరకు జగన్ తగ్గించేశారు.. ఎక్కడా కూడా బెల్టుషాపుల నిర్వహణ లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ మధ్యనే దానికి సంబంధించి అత్యంత వేగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్యనిషేధం ప్రభావం ప్రజల్లో పడటం లేదనే అంచనాకు వచ్చిన జగన్ ఇప్పుడు మద్యం షాపుల్లో 40 శాతం తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నారు.. ఈ మేరకు క్యాబినెట్ మంత్రి నారాయణస్వామి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.