Home / ANDHRAPRADESH / ఇంగ్లీష్ మీడియంతో మతమార్పిడి కథనంపై మండిపడిన వైసీపీ సర్కార్..!

ఇంగ్లీష్ మీడియంతో మతమార్పిడి కథనంపై మండిపడిన వైసీపీ సర్కార్..!

టీడీపీ అధినేత చంద్రబాబు‌కు “కమ్మ “గా కొమ్ముకాసే ఓ ఎల్లోమీడియాధిపతి, ప్రతి ఆదివారం కొత్తపలుకు పేరుతో ఓ చెత్తపలుకు కథనం రాసి..చంద్రబాబు అంతటోడు లేడంటూ భజన చేస్తుంటాడు..మరోవైపు అటు జగన్ సర్కార్‌పై ఇటు కేసీఆర్ సర్కార్‌పై విషం కక్కుతుంటాడు. తాజాగా ఆదివారం నాడు తన చంద్రజ్యోతి పత్రికలో ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను క్రిస్టియన్లగా మార్చేందుకే జగన్ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపడుతుందంటూ చెత్తపలుకు పలికాడు. ఆల్రెడీ వైసీపీకి ఎస్సీ, ఎస్టీలు వైసీపీకి మద్దతు పలుకుతున్నారని..వారిలో మెజారిటీ శాతం క్రిస్టియన్లు మారిపోతున్నారని, ఇక ఏపీలో మెజారిటీగా ఉన్న బీసీలను కూడా క్రిస్టియన్లుగా మార్చి..తమ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకునేందుకు జగన్ సర్కార్ చూస్తుందంటూ.. బాబోరి కట్టుబానిస అయిప పచ్చకట్టప్ప…తన పచ్చపలుకులో చెత్త రాతలు రాశాడు. ఈ కథనంపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా సీఎం జగన్‌పై మతంపేరుతో బురదజల్లిన ఈ కథనంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లనున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా సదరు పచ్చ పత్రికపై మంత్రి సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌తో సహా కొన్ని ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలు పనికట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలు వక్రీకరిస్తున్నారని మంత్రి సురేష్ మండిపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం వల్ల బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మతం మారతారని పచ్చపత్రికలో రాశారని..అయితే ఇంగ్లీషు మీడియంలో చదివిన వాళ్ల పిల్లలు మతం మారారా? విదేశాల్లో ఉంటున్న ఆంధ్రులు మతం మారారా?’ అని మంత్రి ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలు పెద్దఎత్తున వైసీపీకి మద్దతు పలికాయని… ఇంగ్లీషు మీడియంలో పేదపిల్లలు చుదువుకుంటే వాళ్లు ఇక టీడీపీని పట్టించుకోరన్న భయంతోనే ఇంగ్లీష్ మీడియంపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కిరసనాయిలు అని వైసీపీ శ్రేణులు పిలుచుకునే సదరు ఎల్లోమీడియాధిపతి.. ఇంగ్లీష్ మీడియంలో పేదపిల్లలు చదుకుంటే..చైతన్యం పెరిగి..ఇక టీడీపీని పట్టించుకోరన్న భయంతోనే కొత్తపలుకు పేరుతో ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాడని…అది కొత్తపలుకు కాదు చెత్తపలుకు ..అంతకు మించి పచ్చ పలుకు అని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. మొత్తంగా కొత్త పలుకు కథనంపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లడం ఏపీ, మీడియా, రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat