Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్…మరోసారి అడ్డంగా బుక్కైన లోకేష్ పెయిడ్ టీమ్….!

బిగ్ బ్రేకింగ్…మరోసారి అడ్డంగా బుక్కైన లోకేష్ పెయిడ్ టీమ్….!

వైసీపీ అధికారంలోకి వచిన తర్వాత చంద్రబాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ప్రతి రోజూ ఏదో ఒక విషయంపై జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారు. రాజధాని, పోలవరం, పల్నాడు దాడులు, ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం..ఇలా గత ఆరునెలలుగా జగన్ సర్కార్‌పై ఎంత దుమ్మెత్తి పోసినా పెద్దగా ఫలితం లేకుండా పోతుంది. ఆఖరికి లోకేష్‌ ఆధ్వర్యంలోని టీడీపీ సోషల్ మీడియా టీమ్ ఫేక్ వీడియోలతో, ఫేక్ ఫోటోలతో సీఎం జగన్‌ను, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కూడా వెనుకాడలేదు. ఆ మధ్య కృష్ణా నదిలో వరదల నేపథ్యంలో కొందరు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ.. సీఎం జగన్‌ను, మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను కులంపేరుతో కించపరుస్తూ రూపొందించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. ఈ వీడియోలపై వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు ఆ వీడియోల్లో నటించిన టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక తిరుమల శేషాచల కొండల్లో చర్చి అంటూ ఫేక్ ఫోటోలతో లోకేష్ టీమ్ చేయించిన ప్రచారం కూడా బూమరాంగ్ అయింది. అయినా టీడీపీ తన పంథా మార్చుకోవడం లేదు..డైలీ ఏదో ఒక టాపిక్ పట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లే పని మానుకోవడం లేదు.

తాజాగా సీఎం జగన్‌పై దుష్రప్రచారం చేయబోయి లోకేష్ టీమ్ మరోసారి అడ్డంగా బుక్కైంది సీఎం జగన్‌పై, వైసీపీ నేతలపై మీడియా డిబెట్లలో పదేపదే నోరుపారేసుకుంటూ..శాపనార్థాలు పెట్టే బెజవాడ టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ గంజాయి పేరుతో వీడియో చిత్రీకరించింది. తాడేపల్లిలో ఓ మహిళ తనను ఆపి సీఎం జగన్ నివాసం దగ్గరలో విచ్చలవిడిగా గంజాయి అమ్ముతున్నారంటూ..పిల్లల జీవితాలు నాశనం అవుతాయంటూ..ఆవేదన చెందినట్లు అనురాధ ఓ వీడియో తీసింది. ఆ వీడియోను టీడీపీ అఫీషియల్ పేజీలో పోస్ట్ చేయించారు. ముఖ్యమంత్రి ఇంటి దగ్గర్లో మాదకద్రవ్యాల కలకలం..యువతను డ్రగ్స్‌లో ముంచుతున్న ప్రభుత్వం అంటూ.. టీడీపీ సోషల్ మీడియా వింగ్ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అయితే పంచుమర్తి ఫేక్ వీడియో బండారం బట్టబయలైంది. నవంబర్ 18 వ తారీఖు రాత్రి వీడియోలోని మహిళకు డబ్బులు ఇచ్చి గంజాయి అమ్ముతున్నట్లుగా చెప్పించిన అనురాధ..వెంటనే పోస్ట్ చేయలేదు..ఆ వీడియోతో సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేయాలని లోకేష్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా టీమ్‌తో సభ్యులతో కలిసి అనురాధ ప్లాన్ చేసింది. ఈ మేరకు తొలుత 19 వ తేదీ ఉదయం 10.24 నిమిషాల సమయంలో కేసీ చేకూరి అనే టీడీపీ యాక్టివిస్ట్‌తో తెలివిగా ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయించారు. తర్వాత అదే వీడియోను మధ్యాహ్నం 2.45 నిమిషాలకు టీడీపీ అఫీషియల్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయించి..సీఎం జగన్‌పై దుష్ప్రచారం ప్రారంభించారు. తాజాగా అనురాధ తీసిన వీడియోలో మాట్లాడిన మహిళ ఈ వ్యవహారంపై స్పందించింది. గంజాయితో పిల్లలు ఇట్లా చేస్తున్నట్లుగా…అనురాధ మేడమ్ చెబితే చెప్పానని..సదరు వీడియోలోని మహిళ చెప్పింది. నేను మాట్లాడిన మాటలను అనురాధ మేడమ్ ఫోన్‌తో వీడియో తీసి..పంపించారంట..అంతకు మించి నాకేం తెలియదని ఆ మహిళ అసలు వాస్తవాలను బయటపెట్టింది. దీంతో టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తీసిన ఫేక్ వీడియో బాగోతం మరోసారి బట్టబయలైంది. మొత్తంగా గంజాయి పేరుతో సీఎం జగన్‌ను బద్నాం చేయాలని కుట్ర చేసిన లోకేష్ పెయిడ్ టీమ్ మరోసారి అడ్డంగా బుక్కైంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat