టీడీపీ అధినేత చంద్రబాబుకు యూటర్న్ మాస్టర్ అని పేరు..40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబుగారు ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో తీసుకున్న యూటర్న్లు దేశంలో మరే నాయకుడు తీసుకోలేదంటే అతిశయోక్తి కాదు…నారావారి యూటర్న్ చరిత్ర చెప్పాలంటే..పేద్ద గ్రంథమే అవుతోంది. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్‌తో పాటు, ఆయన పార్టనర్ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు తీవ్రంగా వ్యతిరేకించారు..తెలుగును చంపేస్తున్నారంటూ బాబు గగ్గోలుపెడితే..మాతృభాషను మృత భాష చేయకండి అంటూ ప్రాసలతో పవన్ ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నాడు..దీంతో మూడు పెళ్లిళ్లు చేసుకున్నావు..నలుగురు పిల్లలను కన్నావు..వాళ్లు ఏ మీడియంలో చదువుతున్నారంటూ పవన్‌ను వైసీపీ నేతలు ప్రశ్నించాడు. ఇదిలా ఉంటే పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం మీకు ఇష్టం లేదా అంటూ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గమనించిన చంద్రబాబు తెలివిగా ఇంగ్లీష్‌మీడియంపై యూటర్న్ తీసుకుని సైలెంట్ అయిపోయాడు. అయితే పవన్ మాత్రం..ఇంకా ఇంగ్లీష్‌మీడియంపై సుప్రభాతాలు, కవితలు, పుస్తకాలు, నవలలు, మన నది..మన నుడి అంటూ..తనదైన స్టైల్లో ట్విట్టర్లో రాద్ధాంతం చేస్తూనే ఉన్నాడు. అయినా ప్రజల నుంచి ఎంతకూ స్పందన లేకపోయేసరికి.. తన పార్టనర్ యూటర్న్ తీసుకుని తనను ఇరికించాడని పవన్‌కు అర్థమైంది.ఇంకేముంది బాబును ఫాలో అయిపోయాడు. తాజాగా ఇంగ్లీష్ మీడియంపై యూటర్న్ తీసుకున్నాడు.‘ఇంగ్లీష్‌ను వద్దనడం లేదు.. మాతృభాష వదలొద్దు అంటున్నాం’ అంటూ పవన్ ట్వీట్ చేశాడు. జనసేనాని ట్వీట్‌పై నెట్‌జన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. యూటర్న్ అనే పదమే సిగ్గుపడేలా యూటర్న్లు తీసుకునే పార్టనర్ చంద్రబాబు సహవాసంతో నువ్వు కూడా యూటర్న్లు మొదలుపెట్టావుగా పవన్ అంటూ నెట్‌జన్లు ఓ రేంజ్లో సెటైర్లు వేస్తున్నారు.
