Home / ANDHRAPRADESH / తిరుపతిలో రెచ్చిపోయిన మృగాళ్లు

తిరుపతిలో రెచ్చిపోయిన మృగాళ్లు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటన గడవకముందే ఏపీలో తిరుపతిలో మృగాళ్ళు రెచ్చిపోయారు.

ఈ ఎన్కౌంటర్ తర్వాత మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. ఏపీలో తిరుపతి సమీపంలో ఒక మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేయడం రాష్ట్రంలో పెనుసంచలనం రేకెత్తిస్తోంది.

లిప్ట్ ఇస్తామని నమ్మబల్కి బాలికను ముళ్లపూడి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం ఆమెను అక్కడే వదిలేసి వెళ్లారు ఆ యువకులు.

అనంతరం బాలిక ఏడుస్తూ ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.