Home / ANDHRAPRADESH / జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు…జయహో జగన్ !

జగన్ నిర్ణయానికి దేశమంతా అభినందనలు…జయహో జగన్ !

ఏపీ అసెంబ్లీ లో శుక్రవారం దిశ బిల్లును ఏకగ్రీవం గా  ఆమోదించడం జరిగింది. తెలంగాణ లో జరిగిన దిశ అత్యాచార ఘటనకు స్పందిస్తూ మరే కోణంలోను ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో మహిళల రక్షణకు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పై దేశవ్యాప్తంగా  అభినందనలు వెల్లువెత్తుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి గా స్పందిస్తూ జగన్ సర్కారు దిశ చట్టాన్ని రూపొందించింది. సంఘటన జరిగిన 21 రోజులలోపు నేరం రుజువైతే మరణ శిక్ష విధించేలా ఈ చట్టంలో కఠినమైన శిక్షలు రూపొందించారు. దీన్నిబట్టి జగన్, ఆడపడుచులకు ఒక అన్నగా, బిడ్డలకు ఒక తండ్రిగా, తల్లికి ఒక కొడుకులా  ఈ చట్టం రక్షణ కల్పిస్తుందని జగన్ తన అభిప్రాయాన్ని అసెంబ్లీ సాక్షిగా వ్యక్తపరిచారు.

 

 

దిశ ఉదాంతం ఇంకా ఒక కొలిక్కిరాకముందే మహిళల పరిరక్షణ కొరకు నూతన చట్టాన్ని తీసుకువస్తామని జగన్ చేసిన వ్యాఖ్యలు బట్టి జగన్ ను దిశ ఘటన ఎంతగా భాదించినదో అర్ధమవుతుంది. తనకు ఇద్దరు ఆడపిల్లలున్నారని, ఒక తోబుట్టువు వున్నదని, ఒక తల్లికి కొడుకునని, తానుండగా  ఏ ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి ఎదురవ్వనివ్వనని అన్యాయం జరగనివ్వనని జగన్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు మహిళలపై ఉన్న గౌరవం అర్ధమవుతుంది.

 

 

నేషనల్ మీడియాలు  జగన్ ను  దిశ చట్ట రూపకర్తగా అభివర్ణిస్తు దేశం లొనే ఉత్తమ ముఖ్యమంత్రి గా జగన్ ను చూపిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాయి. దేశం లోని ఇతర రాష్ట్రాలు అన్ని జగన్ ను పరిపాలన  లొనే గాక సున్నితమైన విషయాలపై ఏవిధమైన నిర్ణయాలు తీసుకోవాలన్న విషయాన్ని నేర్చుకోవాలని సలహాలు ఇస్తున్నాయి. మొదటిసారి సీఎం గా బాధ్యతలు స్వీకరించినా కేవలం 6 నెలలలోనే సంక్షేమ పథకాల అమలుతో రాజకీయ విశ్లేషకుల ప్రశంసలు పొందినవ్యక్తి గా యావత్తు దేశాన్ని తనవైపు తిప్పుకున్నాకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. భవిషత్తులో కూడా ఇలాంటి ఎన్నో అద్భుతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat