Home / ANDHRAPRADESH / ఈ ఫ్లెక్సీ కనుక చంద్రబాబు చూస్తే మూర్ఛపోవడం ఖాయం..!

ఈ ఫ్లెక్సీ కనుక చంద్రబాబు చూస్తే మూర్ఛపోవడం ఖాయం..!

గ్రాఫిక్స్‌లో మార్ఫింగ్ చేసి ఎదుటివాళ్లపై బురదజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్ టీమ్‌కే సాధ్యం. గతంలో తెలంగాణలో ఆశావర్కర్ల ధర్నాను..మార్ఫింగ్ చేసి, జగన్ అధికారంలోకి రాగానే ఆశావర్కర్లు రోడ్డున పడ్డారంటూ ఏకంగా బాబుగారు తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి నవ్వుల పాలయ్యారు. అలాగే కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు కూడా పడవ బ్యారేజీకి అడ్డుపెట్టినట్లు మార్ఫింగ్ చేసి..అదిగో వైసీపీ వాళ్లు పడవ అడ్డుపెట్టి..మా బాబుగారి ఇంటిని ముంచేస్తున్నట్లు ప్రచారం చేసిన టీడీపీని నెట్‌జన్లు చెడుగుడు ఆడేశారు. అయితే తాజాగా తెలుగు తమ్ముళ్లు చేసిన మార్ఫింగ్ చూసి చంద్రబాబు మూర్ఛబోయే పరిస్థితి ఏర్పడింది.

 

ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబుకు ఏజ్‌బారైపోవడం, లోకేష్‌కు నాయకత్వ లక్షణాలు లేకపోవడంతో వెంటనే పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించాలని నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. అయితే తన కొడుకు లోకేష్ సీఎం కాకుండా ఎక్కడ అడ్డుపడతాడో అన్న భయంతోనే చంద్రబాబు జూనియర్‌ ఎన్టీఆర్‌ను.. నందమూరి కుటుంబానికి, పార్టీకి దూరం చేశాడు. ఆ విషయం అలా ఉంచితే.. ఏపీకి మూడు రాజధానుల వ్యవహారంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. బాబు అమరావతి పాట పాడుతుండడంతో ఒక్క కృష్ణా, గుంటూరు జిల్లాలలో తప్ప..మిగిలిన ప్రాంతాల తెలుగు తమ్ముళ్లు కూడా అసహ‍నం వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు సంక్రాంతి పండుగ చేసుకోకుండా అమరావతి రైతులతో కలిసి ఉపవాస దీక్షలు చేస్తుంటే..మరోపక్క తెలుగు తమ్ముళ్లు మాత్రం ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్నారు.

 

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెంలో తెలుగు తమ్ముళ్లు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నాకు 70 ఏళ్లు అయినా..ఇప్పటికీ స్టిల్ యంగ్..151 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఫుట్‌బాల్ ఆడేస్తానని తొడగొట్టే చంద్రబాబు కనుక ఈ ఫ్లెక్సీని చూస్తే మూర్ఛవచ్చి పడిపోవడం ఖాయం..ఇంతకీ ఆ ఫ్లెక్సీలో ఏం ఉందంటే..2009 ఎన్నికలలో ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పెట్టి దానికింద.. రాబోయే కాలానికి కాబోయే సీఎం…2024
నెక్ట్స్ ఏపీ సీఎం అంటూ రాశారు…ఈ ఫ్లెక్సీలో లోకేష్ ఫోటో చిన్నగా ఓ మూల వేయడం గమనార్హం..మాజీమంత్రి శిద్ధారాఘవరావు ఫోటోతో సహా పలువురు టీడీపీ నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే సీఎం జగన్ ఫోటోను మార్ఫింగ్ చేసి..జూనియర్ ఎన్టీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నట్లుగా క్రియేట్ చేశారు..అంతే కాదండోయ్..సీఎం నేమ్ ప్లేట్ కూడా నందమూరి తారకరామారావు అని మార్ఫింగ్ చేశారు. ఇప్పటికే టీడీపీ పరిస్థితి రెండు జిల్లాలకే పరిమితం అయిపోయింది..ఇక 2024 నాటికి టీడీపీ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయేలా ఉంది..ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీ పగ్గాలు ఆయన చేతిలోకి పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అప్పుడు చంద్రబాబు కూడా చూస్తూ ఉండడం తప్పా..ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అసలే పార్టీ పరిస్థితి నానాటికి దిగజారిపోతుంటే…ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అంటూ ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఇప్పటి నుంచే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై చంద్రబాబుకు కుతకుతలాడిపోతున్నాడు..నిజంగా ఈ ఫ్లెక్సీ కనుక చంద్రబాబు చూస్తే మూర్ఛబోవడం ఖాయమంటూ..తెలుగు తమ్ముళ్లు తమలో తాము జోకులు వేసుకుంటున్నారు.