Home / ANDHRAPRADESH / అయ్యా పవనూ.. పాచిపోయిన లడ్డూల రుచి బాగుందా…!

అయ్యా పవనూ.. పాచిపోయిన లడ్డూల రుచి బాగుందా…!

అంతా అనుకున్నట్లే జరుగుతోంది…జనసేన జెండా పీకేసే పనిలో పడ్డారు పవన్ కల్యాణ్..ప్రస్తుతానికి కాషాయం పార్టీతో కలిసిపోయారు..త్వరలో పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేయడం ఒక్కటే మిగిలింది. విజయవాడలో లాంఛనంగా జనసేన జెండాకు కాషాయం రంగు అద్దారు.. ఆ పార్టీ నేతలతో కలిసి పొత్తు పెట్టుకున్నారు. ఇక నుంచి వైసీపీ సర్కార్‌పై కలిసి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోదీ సర్కార్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించినప్పుడు ఇదే పవన్ కల్యాణ్ కాకినాడలో రెచ్చిపోయారు..ఏపీకి హోదా ఇవ్వకుండా రెండు పాచిపోయిన లడ్డూలు ఇస్తారా వెంకయ్యనాయుడు గారూ అంటూ ఊగిపోయారు. ఇప్పుడు అదే బీజేపీ పార్టీతో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. దీంతో మోదీ సర్కార్ హోదాకు బదులుగా ప్రకటించిన ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన మీరు..ఇప్పుడు ఆ పార్టీతో పొత్తుపెట్టుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని రిపోర్టర్లు ప్రశ్నిస్తే పవన్ కల్యాణ్ బాబుగారిలాగానే నాలిక మడతేశాడు

 

ప్రత్యేక హోదా సాధనలో గతంలో అధికారంలో ఉన్న టీడీపీదే పూర్తి బాధ్యత. అప్పుడే వారు గట్టిగా ప్రయత్నించి ఉంటే సానుకేల స్పందన ఉండేది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి 22 మంది ఎంపీలు, టీడీపీ ముగ్గురు ఎంపీలు ఉన్నారు. హోదాపై ఈ రెండు పార్టీలే బాధ్యత వహించాలి..నాకేం సంబంధం లేదన్నట్లుగా పవన్ మాట దాటేశారు.. రాష్ట్రానికి ఎంతో మేలు చేసే హోదాపై మాత్రం ఆ పార్టీని, ఈ పార్టీని అడగండి..కేంద్రంతో నేనేందుకు మాట్లాడుతా అంటున్న పవన్..మరి జగన్ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటుపై ముందుకు వెళితే అడ్డుకుంటామని..అవసరమైతే కేంద్రంతో మాట్లాడుతా అని అంటున్నారు.. పవన్ సిద్ధాంతం ఒక్కటే..ప్రతిపక్షంలో ఉన్నా..అధికారంలో ఉన్నా…గుడ్డిగా జగన్‌ను వ్యతిరేకించడం..పార్టనర్ చంద్రబాబు పని అయిపోవడంతో ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నా…బిజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు.. బీజేపీతో కలిసినా..బాబు కోసమే పని చేస్తాడనడంలో సందేహం లేదు.. మొత్తంగా ప్యాకేజీని ఏ పాచిపోయిన లడ్డూలతో పోల్చి బీజేపీని ఎద్దేవా చేశాడో…ఇప్పుడు అదే పార్టీతో పొత్తుపెట్టుకుని పవన్‌ హోదాపై నాలిక మడతేస్తున్నారు. ఎంతైనా బాబుతో చేసిన సహవాసం కదా…యూటర్న్‌లు పవన్‌కు కూడా అలవాటైపోయాయి..అయ్యా పవనూ..ఇంతకీ పాచిపోయిన లడ్డూల రుచి బాగుందా..కాస్త చెప్పండి సారూ…!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat