Home / ANDHRAPRADESH / అసెంబ్లీలో రోజా పంచ్‌లకు బిత్తరపోయిన చంద్రబాబు..!

అసెంబ్లీలో రోజా పంచ్‌లకు బిత్తరపోయిన చంద్రబాబు..!

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన స్టైల్లో విరుచుకుపడుతున్నారు. తొలి రోజు చంద్రబాబుది విజన్ 2020 కాదని విజన్ 420 అని ఎద్దేవా చేసిన రోజా రెండవ రోజు తనదైన పంచ్‌లు ప్రాసలతో బాబుపై చెలరేగిపోయారు. అసెంబ్లీ సమావేశాలను వరుసగా రెండో రోజు కూడా పదే పదే అడ్డుకున్న టీడీపీపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలరోజులుగా చంద్రబాబు సేవ్ అమరావతి అంటున్నారు..ఏం సేవ్ అధ్యక్షా ..4 వేల ఎకరాలు రైతుల భూములు దోచుకుని..వాళ్లను బాగా షేవ్ చేసి…ఇంకా ఏం సేవ్ చేయాలని అంటున్నారని.. ప్రశ్నించారు.

 

ఇక చంద్రబాబు తన ప్రసంగంలో ఒక్కసారి కూడా సీమ గురించి మాట్లాడలేదని, కానీ అమరావతిని ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొగిడినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. అయితే ఇదే చంద్రబాబును డర్టీ పొలిటీషియన్‌ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ విమర్శించిన సంగతి మరచిపోయారా అని రోజా ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా గతంలో తెలంగాణ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు లాంటి డర్టీ పొలిటిషియన్‌ దేశ చరిత్రలోనే లేడని కేసీఆర్‌ అన్న సంగతిని రోజా గుర్తు చేశారు. ప్రధాని మోదీగారు మట్టీనీళ్లు ఇచ్చిన చోటే రాజధాని అని…అమరావతి గురించి నానా హంగామా చేస్తున్న చంద్రబాబు ఐదేళ్లలో ఒక్క పర్మినెంట్‌ బిల్డింగ్‌ కూడా ఎందుకు కట్టలేకపోయారని ప్రశ్నించారు.

 

చంద్రబాబు రాయలసీమకు వైజాగ్ దూరమని అంటున్నారని….మరి 2014లో ఇదే పెద్దమనిషి రాయలసీమకు బుల్లెట్ ట్రైన్ వేస్తానని అన్నాడు..ఇప్పుడు ఆ బుల్లెట్ ట్రైన్ ఎక్కడ ఉంది..లోకేష్ ఆడుకుంటున్నాడా అంటూ రోజా వెటకారం ఆడారు. రెయిన్‌గన్లతో సీమలో కరువును జయించాము..రైతులను ఆదుకున్నామన్నాడు..ఎక్కడ రెయిన్‌గన్‌లు.. ఆయన మనవడు దేవాంశ్ అడుకుంటున్నాడా అంటూ బాబును ఎద్దేవా చేశారు. ఏపీని సన్‌రైజ్ స్టేట్ చేస్తానని చెప్పి.. తన సన్‌‌ను రెయిజ్ చేసి… ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని, ఇప్పుడు అమరావతిపై రాద్ధాంతం చేస్తున్నారని బాబుపై రోజా మండిపడ్డారు. మొత్తంగా అసెంబ్లీలో తనదైన పంచ్‌లు, ప్రాసలతో తనపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విరుచుకుపడుతుంటే..చంద్రబాబు నోరెళ్లపెట్టి కామ్‌గా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది.