Home / ANDHRAPRADESH / ఆ పని చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తావా లోకేష్..ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఆ పని చేయలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తావా లోకేష్..ఎమ్మెల్సీ స్ట్రాంగ్ వార్నింగ్..!

ఏపీ శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లుకు అనుకూలంగా ఓటేసిన టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే సునీత వైసీపీకి అమ్ముడుపోయారంటూ…చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు అనుకుల మీడియాలో కూడా పోతుల సునీత డబ్బులకు అమ్ముడుపోయిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తనపై మీడియాలో జరుగుతున్న ప్రచారంపై, లోకేష్ ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. తాను, తన భర్త పోతుల సురేష్ డబ్బులకు అమ్ముడుపోయామంటూ లోకేష్ అసత్య ప్రచారం చేస్తున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

లోకేష్ అహంకారంతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. మేము వైసీపీ నేతల దగ్గర డబ్బులు తీసుకున్నామని మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా..అని ప్రశ్నించారు. మేం డబ్బులు తీసుకున్నామని సాక్ష్యాలతో రుజువు చేస్తే..మేం రాజకీయ సన్యాసం చేస్తాం…అదే రుజువు చేయకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని లోకేష్‌కు పోతుల సునీత సవాల్ విసిరారు. నేను, నా భర్త కమ్యూనిస్ట్ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి వచ్చామని, 15 సంవత్సరాలు ఉద్యమాలలో పని చేసి, 25 ఏళ్లుగా టీడీపీలో బీసీ నాయకురాలిగా, మచ్చలేని నాయకురాలిగా నీతి, నిజాయితీతో పార్టీకి సేవలందిస్తే…ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తారా అని లోకేష్‌ను నిలదీశారు.

 

ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులమయ్యామని..సునీత చెప్పారు. ఆంధ్ర రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి చెందాలనే సదుద్దేశంతో…మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చామని పోతుల సునీత తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డెవలప్ అంతా హైదరాబాద్‌‌లో కేంద్రీకరించడం వల్ల ప్రాంతీయ విబేధాలు తలెత్తాయని..అలా నవ్యాంధ్రప్రదేశ్‌లో జరుగకుండా జగన్ బాటలో తాము మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు పలికామని సునీత స్పష్టం చేశారు. ఇక చంద్రబాబు, టీడీపీ నేతల కుటిల రాజకీయాల వల్లే శాసనమండలి రద్దు అయిందని ఆమె తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ గారు…టీడీపీ ఎమ్మెల్సీలు కలిసివస్తారని మూడు రోజులు టైమ్ కూడా ఇచ్చారని..కాని తెలుగు దేశం నేతలు చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వంతపాడుతూ…  శాసనమండలి రద్దుకు కారణమయ్యారని ఫైర్ అయ్యారు..లోకేష్, టీడీపీ నేతలు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇలా ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే సహించేది లేదని…పోతుల సునీత వార్నింగ్ ఇచ్చారు. కాగా శాసనమండలి రద్దు నేపథ్యంలో తన పదవి కూడా పోతుందని తెలిసినా పోతుల సునీత వైసీపీలో చేరడం పట్ల ఏపీ రాజకీయవర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది.. చంద్రబాబు వాడుకుని వదిలేసే బుద్ధిపట్ల పోతుల సునీత విసిగిపోయారని..అందుకే పార్టీ మారారని ప్రకాశం జిల్లాలో చర్చ జరుగుతోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat