Home / ANDHRAPRADESH / ఆ ఫ్రస్టేషన్‌ ఏంటీ, ఆ పిచ్చి సవాళ్లు ఏంటీ..చంద్రబాబుకు ఏమైంది..అంబటి ఫైర్..!

ఆ ఫ్రస్టేషన్‌ ఏంటీ, ఆ పిచ్చి సవాళ్లు ఏంటీ..చంద్రబాబుకు ఏమైంది..అంబటి ఫైర్..!

శాసనమండలి రద్దుపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో శాసనమండలి ఏర్పాటును వ్యతిరేకిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను అంబటి ఉటంకిస్తూ ఎల్లోమీడియాను ఏకిపారేశారు. నాడు కాంగ్రెస్‌ పార్టీ సీఎంగా వైఎస్సార్‌ శాసనమండలి ఏర్పాటు చేశారని గుర్తు చేసిన అంబటి.. అదే సమయంలో చంద్రబాబు మాట్లాడింది ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో శాసన మండలి రద్దు ఒక కీలకమైన తీర్మానం. 1983లో నాడు ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయమే తిరిగి నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్నారు. కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా సభకు రాలేదు. ఇది మీ తప్పు కాదా? అని అంబటి ప్రశ్నించారు.

 

శాసనమండలి రద్దు చర్చలో పాల్గొనని చంద్రబాబు నాయుడు మూడు రాజధానుల అంశంపై దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి..ఎవరూ గెలుస్తారో చూద్దాం అంటూ….పిచ్చి సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. ఏడు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఎలా అడుగుతారు? మీకు అంత ఉబలాటమే ఉంటే… మీ 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతో రాజీనామా చేయించి, రాజధాని మార్పుపై పోటీ చేస్తున్నామని చెప్పి ప్రజల్లోకి వెళ్లాలని..అప్పుడు మీ బండారం బట్టబయలైవుతుంది..అంతే కాని పిచ్చి సవాళ్లు విసరడం కాదని కౌంటర్ ఇచ్చారు.. అయినా మీరు ఇప్పుడు రాజకీయాలు మానుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చంద్రబాబుకు అంబటి రాంబాబు చురకలు అంటించారు.

 

ఇక మండలి రద్దుపై చంద్రబాబు అసెంబ్లీకి రాకపోవడంపై అంబటి స్పందించారు. నాడు-నేడు అన్నట్టు శాసనమండలి పునః నియామకంపై గతంలో చంద్రబాబు అన్న మాటలను సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో వీడియో క్లిప్పింగులుగా ప్రదర్శించారని గుర్తుచేశారు. ఆ క్లిప్పింగులు చూసి చంద్రబాబుకు మతిభ్రమించిందని చెప్పారు. అందుకే మీడియా సమావేశంలో అంతలా ఫ్రస్టేషన్‌తో రెచ్చిపోయాడని ఎద్దేవా చేశారు. ఆ వీడియోలతో చంద్రబాబు లాంటి యూ టర్న్ తీసుకునే నేత దేశంలోనే లేడని అర్థమవుతోందన్నారు.

 

 

అయితే పిల్లనిచ్చి మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు… సీఎం జగన్.. వైఎస్ఆర్‌ను కొట్టాడని.. విజయమ్మ రోశయ్యతో చెప్పాడని కళ్లబొల్లి కబుర్లు చెప్తున్నారని ఫైరయ్యారు. మీరు మాట్లాడితే చూపించే ఎల్లో మీడియా ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అసలు ఎన్టీఆర్‌ స్థాపించిన పార్టీ లాక్కొని వెన్నుపోటు పొడిచింది వాస్తవం కాదా? నీ తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావును మోసం చేసింది వాస్తవం కాదా? నీ కొడుకు లోకేష్‌ రాజకీయ వారసుడు కావాలని, అసలైన ఎన్టీఆర్‌ వారసులకు అన్యాయం చేస్తున్నది నిజం కాదా… సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడుని కూడా అన్యాయం చేయలేదా… లోకేష్‌ కోసం ఇన్ని ఘోరాలు చేశావు. భవిష్యత్‌లో మరిన్ని ఘోరాలు చేయడానికి వెనకాడవని అంబటి చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat