Home / 18+ / ప్రజలు చనిపోయే పరిస్థితులు వచ్చినా ఎల్లో మీడియా మారదా.? చంద్రబాబు

ప్రజలు చనిపోయే పరిస్థితులు వచ్చినా ఎల్లో మీడియా మారదా.? చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ కు శాపంగా ఎల్లో మీడియా మారిందని ఇటీవల పలు వార్తా ఛానళ్లు కూడా ప్రసారంచేసిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దురదృష్టవశాత్తు మన తెలుగు రాష్ట్రాలకు కూడా వ్యాపించిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన మీడియా ముఖ్యంగా ఎల్లో మీడియా ఇప్పటికీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోంది. ఒకవైపు మహమ్మారి గురించి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సింది పోయి మొదట్లో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసే కథనాన్ని ప్రసారం చేసింది. కరోనాతో విశాఖలో ఓ వ్యక్తి చనిపోయాడనే వార్తను ప్రసారంచేసింది.. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన వార్నింగ్ తో ఆ కథనాలు తప్పని ప్రసారం చేసింది.

 

అలాగే రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తేనే వైరస్ వ్యాప్తి నియంత్రించవచ్చని ఏపీ ప్రభుత్వం భావిస్తూ రాష్ట్ర సరిహద్దులను మూసివేయగా.. ఎక్కడివారు అక్కడే ఉండాలని ముఖ్యంగా తెలంగాణలో ఉన్నవారు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని, తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటాం అని చెప్పినా ఎల్లో మీడియా మాత్రం తమ రాష్ట్రంలోకి తమను రానివ్వడం లేదంటూ ప్రజలను రెచ్చగొట్టే ప్రసారాలు చేస్తోంది. మరోవైపు వైరస్ తో అందరూ అప్రమత్తమవుతున్నా ఆ తరహా ప్రసారాలు చేయకుండా అమరావతి ఉద్యమం ఇప్పటికీ జరుగుతోందని, అమరావతి ఉద్యమాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది.

 

అలాగే ప్రధాని మోడి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన కేసీఆర్, జగన్ లు నాలుగు రోజులకు లేదా మూడు రోజులకు ఒకసారి మాత్రమే మీడియా ముందుకు వస్తుంటే.. చంద్రబాబు మాత్రం కరోనాను తానే కంట్రోల్ చేస్తున్నట్టుగా ప్రతిరోజు మీడియా సమావేశం పెట్టి చెప్పిందే చెప్పి జనాలను విసిగిస్తున్నారు. చంద్రబాబు మీడియా సమావేశాలను కూడా అదేపనిగా ఎల్లో మీడియా హైలెట్ చేస్తోంది.. ముఖ్యమైన ప్రసారాలను పక్కనపెట్టి చంద్రబాబు చెప్పే ఉపన్యాసాలను చూపిస్తోంది. ఇప్పటికీ ఎల్లో మీడియా మారకపోవడం అదే పద్ధతిని కొనసాగించడం, నిజంగా తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలు దురదృష్టంగా భావించాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat