Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబుకు మ‌రో షాక్.. పోల‌వ‌రంపై సీబీఐ విచార‌ణ‌కు మోడీ స‌ర్కార్ ఆదేశం..!?

చంద్ర‌బాబుకు మ‌రో షాక్.. పోల‌వ‌రంపై సీబీఐ విచార‌ణ‌కు మోడీ స‌ర్కార్ ఆదేశం..!?

కేంద్ర ప్ర‌భుత్వంతో పోట్లాడి మ‌రీ.. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ను తీసుకున్న చంద్ర‌బాబు స‌ర్కార్.. ప్రాజెక్టు నిర్మాణాన్ని అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తుందా..? ఇదే ఇప్పుడు నీటి రంగ నిపుణుల‌ను, రైతు సంఘాల నేత‌ల‌ను వెంటాడుతున్న ప్ర‌శ్న‌. నిజం చెప్పుకోవాలంటే పోల‌వ‌రం ప్రాజెక్ట్ ఎప్పుడో జాతీయ హోదా పొందింది. అయితే, దీని నిర్మాణ బాధ్య‌త‌ను తామే చూసుకుంటామ‌ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు అంటున్నా.. వినిపించుకోని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. లేదు.. లేదు.. పోల‌వ‌రం ప్రాజెక్టును మేమే క‌ట్టుకుంటామంటూ ప్ర‌త్యేక హోదాను సైతం వ‌దులుకుని, కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల వెంట‌ప‌డి మ‌రీ పోల‌వ‌రం జెక్టును చేజిక్కించుకున్నారు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు.

అయితే, ప్ర‌స్తుతం పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చూస్తే న‌త్త‌లు కూడా న‌వ్విపోయే రీతిలో కొన‌సాగుతున్నాయ‌న్న మాట‌లో అతిశ‌యోక్తి లేదు. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌ను త‌న‌కు కావాల్సిన వారికి ఇచ్చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో అనుకున్న స‌మ‌యానికి ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌య్యే ప్ర‌స‌క్తే లేద‌ని అంటున్నారు నీటిరంగ నిపుణులు.

అయితే, ప్ర‌స్తుతం చంద్ర‌బాబు స‌ర్కార్ పోల‌వ‌రం ప్రాజెక్ట్‌పై వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. పోల‌వ‌రం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాక‌పోవ‌డం ఏంట‌ని… ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇస్తున్న నిధుల‌ను ఏం చేస్తున్నార‌ని ఏపీ ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌శ్న‌ల‌తో నిధుల గురించి నిజం చెప్ప‌లేక చంద్ర‌బాబు స‌ర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. టీడీపీ ఎంపీ, చంద్ర‌బాబు స‌న్నిహితుడు, పోల‌వ‌రం కాంట్రాక్ట‌ర్ అయిన రాయ‌పాటి సాంబ‌శివ‌రావును పోల‌వ‌రం ప్రాజెక్ట్ కాంట్రాక్ట‌ర్‌గా త‌ప్పించాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌లుమార్లు ఆదేశించినా లంచాల‌కు ఆశ‌ప‌డిన టీడీపీ స‌ర్కార్ ఆ ప‌ని చేయ‌లేక‌పోయింది.

అయితే, కేంద్ర ప్ర‌భుత్వం పోల‌వ‌రం ప్రాజెక్టుపై జ‌రిపిన విచార‌న‌లో ఇప్పటివరకు ఇరూ.16,800 కోట్లరూపాయలను తీసుకొని, కేవలం 750 కోట్ల విలువైన పనులేచేసి, మిగిలిన డబ్బులను రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ సొంతానికి వాడేసుకున్నట్లు తేలింది. ఆ వాడుకున్న న‌గ‌దులో స‌గం చంద్ర‌బాబుకు వెళ్లింద‌న్న విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చంద్ర‌బాబుకు ఎంపీ రాయ‌పాటి సాంబ‌శివ‌రావు నుంచి అందిన పోల‌వ‌రం ప్రాజెక్టు నిధుల‌తో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయడానికి వినియోగించార‌న్న విష‌యం అంద‌రికీ విధిత‌మే.

అలాగే చంద్ర‌బాబు స‌ర్కార్ విజయవాడ దుర్గగుడి ఫ్లైవోవర్ బ్రిడ్జి నిర్మాణాన్నికూడా ఇలానే చేస్తున్న‌ద‌ని కేంద్ర ప్రభుత్వ జ‌రిపిన విచార‌ణ‌లో వెల్ల‌డైంది. కేంద్ర ప్ర‌భుత్వ ప్రాథ‌మిక విచార‌ణ‌లో ఈ విష‌యం కాస్తా బట్టబయలవడంతో చంద్ర‌బాబు ఆలోచ‌న‌లో ప‌డ్డాడు. అంతేకాదు, త‌న‌ అనుకూల ఎల్లో మీడియా ద్వారా కేంద్రంపైనే ఆ నెపాన్ని నెట్టేసే వ్యూహం ర‌చించే ప‌నిలో ప‌డ్డాడు చంద్ర‌బాబు. అయితే, తాజా స‌మాచారం ప్ర‌కారం పోల‌వ‌రం ప్రాజెక్టు నిధుల దుర్వినియోగంపై కేంద్ర ప్ర‌భుత్వం త్వరలో సీబీఐ. ఎంక్వౌరీ జ‌ర‌ప‌బోతుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat