ప్రముఖ సాహితీవేత్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఫైరయ్యారు. ఇటీవల ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా, గోదావరి పుష్కరాల సమయంలో వేలకు వేల కోట్ల నిధులు వినియోగించడం వృధా ఖర్చేనని పేర్కొన్నారు. అలాగే, 2014 ఎన్నికల సమయంలో తెలుగు భాషకు సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలోని 49వ పేజీలో ఏముందో.. దానిని, ఇంకా 2015 గిడుగు రామ్మూర్తి జయంతి రోజున తుమ్మలపల్లి ఆడిటోరియంలో చంద్రబాబు ఏం చెప్పారో వాటిని అమలు చేయాలన్నారు.
