ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిత్యం ప్రజాస్వామ్య విలువల కోసం తపించే వైఎస్ జగన్ చంద్రబాబు అవినీతి రాజకీయాలను దృష్టిలోపెట్టుకుని.. ప్రజాస్వామ్య విలువలకు పాతరవేసే చంద్రబాబు సర్కార్‌కు దిమ్మదిరిగేలా కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై తన నిర్ణయాన్ని ప్రకటించారు.
అవకాశం దొరికొతే చాలు… నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువునని స్వోత్కర్షకు పోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల విషయాల్లో తెలుగు గడ్డకు మచ్చ తెచ్చారు. చంద్రబాబు నాడు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పట్నుంచి.. నేటి వరకు అవినీతి రాజకీయాలు నడిపించడంలో అపర చాణుక్యుడనే చెప్పుకోవాలి.
ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికలో సైతం ఆ విషయం బటయపడింది. నంద్యాలలో వైసీపీ కేడర్ ఎక్కువ ఉన్నప్పటికీ.. అధికారపార్టీ.. ధన ప్రవాహం.. ఓటర్లను కొనే మనస్తత్వం కల చంద్రబాబు రాజకీయం టీడీపీ అభ్యర్థిని గెలిచేలా చేశాయనడంలో ఎటువంటి సందేహం లేదు.
చంద్రబాబు అవినీతి రాజకీయాన్ని దృష్టిలో ఉంచుకునే.. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే ఉద్దేశంతో తాము కర్నూలు జిల్లా స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య తెలిపారు.