Home / ANDHRAPRADESH / వైసీపీ ఫైన‌ల్స్ జాత‌కం తేల్చేసిన.. బీజేపీ అనుకూల మీడియా స‌ర్వే..!

వైసీపీ ఫైన‌ల్స్ జాత‌కం తేల్చేసిన.. బీజేపీ అనుకూల మీడియా స‌ర్వే..!

ఏపీలో అధికాంలో ఉన్న టీడీపీ స‌ర్కార్‌కి కొంప‌ముంచే వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 2014లో కొద్ది తేడాతో అధికారం ద‌క్కించుకున్న టీడీపీ.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం జాత‌కం తారుమారు కావ‌డం ఖాయ‌మ‌ని రిపబ్లిక్ మీడియా స‌ర్వే తేల్చేసింది. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖచ్చితంగా ఎలాగైనా అధికారంలోకి రావాల‌న్ని నిరంత‌రం శ్ర‌మిస్తున్న వైసీపీ జాత‌కం కూడా ఆ స‌ర్వేలో తేలిపోయింది.

2018 జనవరిలో రిపబ్లిక్ టీవీ, సీఓటర్ నిర్వహించిన సర్వే ప్ర‌కారం టీడీపీ,బీజేపీ కూటమికి 12 ఎంపీ సీట్లు.. వైసీపీకి 17 ఎంపీ సీట్లు వ‌స్తాయ‌ని ఆ స‌ర్వే తేల్చేసింది. దీంతో ఈ స‌ర్వే రిజ‌ల్ట్ వైసీపీకి మ‌రింత జోష్ పెంచ‌గా.. టీడీపీకి మాత్రం మింగుడుప‌డ‌ద‌ని చెప్పొచ్చు. ఏపీలో రానున్న సార్వ‌త్రిక ఎన్నికలకు ఎంత లేదన్నా ఏడాది సమయం ఉంది. దీంతో ఇప్పుటికే ప‌తాక స్థాయితో చంద్ర‌బాబు ప్రభుత్వం పై ఉన్న వ్య‌తిరేక‌త‌.. ఇంకొంత పెరిగే అవ‌కాశం ఉంది త‌ప్పా.. త‌గ్గే అవ‌కాశం లేద‌ని.. విశ్లేష‌కుల కూడా భావిస్తున్నారు. ఈ లెక్కన ఎలా చూసిని ప్ర‌తిప‌క్ష వైసీపీకి రాబోవు ఎన్నికల్లో అనుకూల వాతావరణం ఎక్కువ‌గా ఉంద‌ని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు.

అయితే ప్రస్తుతం టీడీపీ పై ఉన్న వ్య‌తిరేక‌త‌ను.. వైసీపీకి ఉన్న‌ అనుకూల పరిస్థితులను వైసీపీ తనకు అనుకూలంగా ఏ మేరకు మార్చుకుంటుందో వేచిచూడడాల్సిందే. ఇక వైసీపీ అధినేత జగన్మోహహన్ రెడ్డి ప్రస్తుతం ఏపీలో పాదయాత్ర సాగిస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ టీవీ, సీ ఓటర్ సర్వే ప్రధానంగా పార్లమెంట్ నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టినా అదే ఫలితాలు సహజంగా అసెంబ్లీలోనూ ప్రతిఫలిస్తాయి. కొన్ని మార్పులు ఉన్నా.. చంద్రబాబుకు ఎదురుగాలి అనే విషయం మాత్రం రిపబ్లిక్ టీవీ సర్వే స్పష్టం చేస్తోంది. అయితే మొత్తం మీద ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే విషయం ఈ సర్వే ద్వారా తేలిపోయింద‌ని.. ఇక మ‌రోసారి ఏపీలో చంద్ర‌బాబు స‌ర్కార్ అధికారంలోకి రావ‌డం అసాధ్య‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat