నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.
అయితే, ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను కలిసి చంద్రబాబు పాలనలో తన సమస్యలు చెప్పుకునేందుకు వచ్చాడు రైతు శివన్న. చంద్రబాబు పాలనలో రైతులు నిలువెల్లా మోసపోయారని, పంటకు గిట్టుబాటు ధర రాక, రుణాలు సక్రమంగా అందించకపోవడంతో తాము పంటలను పండించలేకపోతున్నామని జగన్‌ముందు వాపోయాడు రైతు శివన్న.
రైతు శివన్న బాధను విన్న వైఎస్ జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు మోసాలపై ప్రజలకు వివరించారు. చంద్రబాబు నాయుడు రైతులకు మాయమాటలు చెప్పి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారని, అధికారంలోకి వచ్చాక తన అవినీతి హామీలకు కొనసాగింపుగా రెయిన్‌గన్‌తో రైతులను మళ్లీ మోసం చేశారన్నారు.
ఇక శివన్న విషయానికొస్తే.. ఐదెకరాలలో శనక్కాయపంట వేస్తే కనీసం 100 నుంచి 80 బస్తాల దిగుబడి వస్తుందని, కానీ చంద్రబాబు హామీలు నమ్మి, రెయిన్ గన్ అంటూ చంద్రబాబు చూపిన ఆశతో రైతులు గల్లంతయ్యారన్నారు. చంద్రబాబు రెయిన్ గన్‌ను నమ్మి పంట వేసిన రైతులు నట్టేట మునిగారని, శివన్నకైతే ఐదెకరాల శనక్కాయ పంటలో అర బస్తా మాత్రమే పంట చేతికి వచ్చిందని చెప్పారు. అసలు పంట సాగు కోసం శివన్న రూ.90వేలు అప్పు చేశాడని, ఇప్పుడు ఆ అప్పు తీర్చేందుకు ఒడియాలు, బూరగలు అమ్ముకుంటూ తిరుగుతున్నాడని, ఇదంతా చంద్రబాబు నాయుడు ఘనకార్యమంటూ ఎద్దేవ చేశారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.