ఆ విషయంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎస్ జగన్ మోహన్‌రెడ్డి దే పై చేయి.. ముఖ్యమంత్రి చంద్రబాబు డీలా.. అవును మీరు చదివింది నిజమే. చంద్రబాబు రాజకీయ అనుభవంతో పోలిస్తే వైఎస్ జగన్ పది మెట్లు ఎక్కువే ఎక్కారు.
ఇక అసలు విషయానికొస్తే.. వైఎస్ ఏ పనిచేసినా ఒంటికాలిపై లేచే అధికార పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కమిట్‌మెంట్‌ను ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు కనబర్చరు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడు ఇదే విషయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
అయితే, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసేందుకు తాము సిద్ధమని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. జగన్ అలా ఇంటర్వ్యూ ఇచ్చాడో! లేదో!! ఆ వెంటనే టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు వైఎస్ జగన్‌పై విమర్శలు సంధించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముస్లిం వ్యతిరేకిగా మారిపోయారంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. మరో పక్క మాత్రం ఏం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్‌పై బీజేపీతో కలిస్తే తప్పేంటి.. ప్రత్యేక హోదా వస్తే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారు కదా..! అంటూ చంద్రబాబుతో సహా బీజేపీ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు.