న్యూఇయర్ జనవరి ఫస్ట్‌న ప్రపంచమంతా వెలుగు చిమ్మితే.. అదే నెల జనవరి థర్టీ ఫస్ట్‌న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని.., దీంతో గ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. ఇదిలా ఉండగా.. హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న విషయాలను వెల్లడిస్తున్నారు. మరికొన్ని ఛానెల్స్ అయితే గ్రహణ సమయాలు ఇవీ., గ్రహణం నిబందనలు ఇవీ.., ఆహార పానీయ నిబంధనలు ఇవీ, ఇలా చేస్తే ఫలితం, ఈ పనులు చేయకూడదంటూ రాసేశాయి కూడా. పై విషయాలన్నింటిని కాసేపు అటుంచితే.. చంద్రగ్రహణాన్ని, చంద్రబాబును పోలుస్తూ కొందరు నెటిజన్లు ఫేస్‌బుక్ వేదికగా కొన్ని పోస్టులు పెడుతున్నారు. ఏపీకి గత నాలుగేళ్ళుగా చంద్రబాబా గ్రహణం పట్టుకుందని.. దీంతో తాజా చంద్రగ్రహణం ఏపీ ప్రజల్ని మాత్రం ఏంచేయలేదని సెటైర్లు వేస్తున్నారు.
