అవును, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను కోట్లు పోసి కొన్నారు అంటూ సినీ నటుడు మంచు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్‌బాబు మాట్లాడుతూ వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల తీరు సరైంది కాదన్నారు.
దాసరి నారాయణరావు మృతిచెందిన తరువాత తెలుగు సినీ ఇండస్ర్టీలో గురువు స్థానం అలానే ఉంది. కచ్చితంగా సీనియారిటీ ప్రకారం ఆ స్థానం మీకే చెందాలి. ఆ స్థానంలో కూర్చొని టాలీవుడ్ సమస్యలను పరిష్కరించొచ్చు కదా..!! అన్న ప్రశ్నలకు మోహన్‌బాబు సమాధానం చెప్తూ.. టాలీవుడ్ సమస్యలను సులభంగా పరిష్కరించగలను. కానీ. అందరికీ విరోధినైపోతాను అన్నారు. చిన్న నిర్మాతలు కూడా వెంట వస్తే నేను రెడీ.. కానీ వాళ్లల్లో కూడా పొలిటికల్‌గా చీలికలు వస్తుంటాయన్నారు మోహన్‌బాబు.
ఉదాహరణను గురించి చెబుతూ పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడారు మోహన్‌బాబు. ప్రజలు ఎవరికి ఓటేసింది. పలాన పార్టీ అని మీకు ఓటేస్తే.. గెలిచిన తరువాత వేరే పార్టీలోకి వెళ్లడం నీచత్వం, నికృష్టం అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలనుద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన తరువాత ఆ పార్టీ ఇష్టం లేకపోతే రిజైన్ చెయ్యాలి. అంతేకానీ డబ్బుపై మమకారం పెంచుకుని వేరే పార్టీలోకి వెళ్లడం సరైంది కాదంటూ తన అభిప్రాయాన్ని చెప్పారు మంచు మోహన్‌బాబు.