ఏపీలో తాజా రాజకీయా పరిణామాల దృష్ట్యా టీడీపీ గ్రాఫ్ జీరోకు పడిపోయిందా..? 2019లో టీడీపీ అధికారంలోకి రావడం కష్టమేనా..? ఇప్పటి వరకు ధీమాగా ఉన్న టీడీపీ ఒక్కసారిగా చతికలబడిందా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు. వీటికి తోడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సర్వే కూడా ఇందుకు వంత పాడింది. అయితే, సర్వేలో చేయించి మంత్రులకు ర్యాంకులు ఇస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన అనుచర వర్గంతో ఇటీవల చేయించిన సర్వేలో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
see also : ”జగన్‌కు అన్ని కేసుల్లో క్లీన్ చిట్”.. ”లాజిక్ ఇదే” :సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్
ఓ సారి ఏపీ సీఎం చంద్రబాబు సర్వేపై ఓ లుక్కేద్దాం.. 2014 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. ప్రజల సంక్షేమాన్ని మరిచి, అమలు కానీ హామలు గుప్పించి అధికారం చేపట్టిన టీడీపీ, 2019 ఎన్నికల్లో మాత్రం అధికారం చేజిక్కించుకోవాల నుకుంటున్న చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పనిసరి అంటోంది ఆ సర్వే. ఈ సర్వేలో వెల్లడైన విషయాలను గమనిస్తే.. వచ్చే ఎన్నికల్లో శాసనసభ స్థానాలను కోల్పోతుందని సర్వేలో వెల్లడైంది. ఈ విషయం తన సొంత సర్వేలోనే వెల్లడి కావడంతో చంద్రబాబుకు చుక్కలు కనిపించాయి.
see also : నాడు వైఎస్‌ఆర్.. నేడు వైఎస్ జగన్ – 2019లో హిస్టరీ రిపీట్..!! ”ఇది ఫిక్స్”
పార్టీ మెరుగ్గానే ఉంది కదా..! కాకపోతే తెలంగాణలో మాత్రమే పార్టీ పరిస్థితి అటు.. ఇటుగా ఉందిలే అంటూ అనుకుంటూ వచ్చిన చంద్రబాబుకు ఈ సర్వే వివరాలను చూసిన తరువాత నిద్ర పట్టడం లేదంట. అంతేగాక, సర్వేలో విస్తుపోయే విషయాలు బయటకు రావడంతో చంద్రబాబుకు మింగుడుపడటం లేదంట. తాను చేయించిన సర్వేలోనే తమ పార్టీకి వ్యతిరేకంగా సర్వే రావడంతో ఖంగుతిన్న చంద్రబాబు.. ఈ సర్వే విషయాలను బహిర్గతం చేయొద్దంటూ టీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.