2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న నాయకుడినంటూ బూటకపు హామీలను గుప్పించి.. ఏపీ ప్రజటను నట్టేట ముంచిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. అయితే, రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు మరిన్ని కష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఆ క్రమంలోనే చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి గెలిపించారు. అయితే, చంద్రబాబు అధికారం చేపట్టాక తాను మేనిఫెస్టోలో పెట్టిన హామీలను మరిచి.. ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చిన బడ్జెట్‌ను ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోలు కోసం వినియోగించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల తరువాత చంద్రబాబు పరిస్థితి మరీ దారుణంగా తయారైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, పార్లమెంట్ లో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిస్తే ఆ విషయాలను అర్థమవుతాయి. ఓ వైపు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్‌లో తమ ఎంపీలు పోరాడుతున్నారని చెబుతూ.. చంద్రబాబు మాత్రం బడ్జెట్‌పై నోరు మెదపలేదు. అంతేకాకుండా, కేంద్ర మంత్రులు పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్న సమయంలో టీడీపీ ఎంపీలు బల్లలు గుద్ది మరీ వారిని అభినందించిన విషయం విధితమే. అంతేకాకుండా, మీడియా సాక్షిగా టీడీపీ ఎంపీలు మోడీ బడ్జెట్‌పై, ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నిధులపై ప్రశంసల వర్షం కురిపించారు కూడాను.
దీనికంతటికి కారణం చంద్రబాబుపై ఉన్న కేసులే. అందులో ప్రధానమైనది ఓటుకు నోటు కేసు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ప్రధాని మోడీకి ఎక్కడ అడ్డం తిరిగితే తనను జైల్లో పెడతారన్న భయంతో చంద్రబాబు తన కుఠిల రాజకీయంతో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యలా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఇలా ప్రధాని మోడీని ఎదుర్కోలేక.. మరో వైపు ఓటుకు కేసు నుంచి బయట పడలేక చంద్రబాబు దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.