Home / ANDHRAPRADESH / చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!!

చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల పార్ట‌న‌ర్‌షిప్‌ను ఆధారాల‌తో స‌హా ఏకిపారేశాడు..!! స్వ‌యాన సినీ న‌టుడైన ప‌వ‌న్ క‌ల్యాణ్ డ‌బ్బు కోసం, ప్యాకేజీ కోసం ఏపీలో కొన్ని ఇష్యూస్‌ను రేస్ చేసుకుని, అందుకు చంద్ర‌బాబు, బీజేపీ వ‌ద్ద ప్యాకేజీ తీసుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు చేసేదేమీ లేదు. ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ త‌రువాత ఏపీకి అన్యాయం జ‌రిగిందంటూ ప్ర‌త్యేక హోదా అంశంపై మ‌ళ్లీ ఉద్య‌మం రూపుదిద్దుకుంటున్న నేప‌థ్యంలో అప్ప‌టి వ‌ర‌కు తెర వెనుక ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్.. హోదా అంశంపై తెర‌పైకి రాగానే జేఎఫ్‌సీ కమిటీ వేస్తున్నామంటూ కాల‌పాయ‌ప‌న చేస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఇదేమీ కొత్త కాదు.. నాడు వైజాగ్ వేదిక‌గా జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక హోదా అంశంపై ప్ర‌త్యేక స‌భ నిర్వ‌హిస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ తీరా.. సీఎం చంద్ర‌బాబుతో కుమ్మ‌క్కై ప్ర‌జా ఉద్య‌మాన్ని నీరు గార్చార‌న్నారు. చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ధ్య పార్ట‌న‌ర్ షిప్ ఉంద‌న్న అంశానికి ఈ ఆధారాలు చాల‌న్నారు సినీ క్రిటిక్ మ‌హేష్ క‌త్తి.

see also : ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!

see also : ఓ మై గాడ్‌.. జ‌గ‌న్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్‌..!

ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా ఏర్పాటు చేసిన జేఎఫ్‌సీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజీ విష‌యం బ‌య‌ట‌ప‌డింద‌న్నారు. చంద్ర‌బాబు నాయుకు అనుకూలంగా కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన ప్ర‌త్యేక ప్యాకేజీని మ‌ల‌చ‌డానికే జేఎఫ్‌సీ ఏర్ప‌డింద‌ని విమ‌ర్శించారు. అలాగే, మ‌రో విష‌యంపై స్పందించిన క‌త్తి మ‌హేష్ మాట్లాడుతూ.. ఒక ఐఏఎస్‌గా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ కామ‌న్‌సెన్స్ కూడా లేకుండా జేఎఫ్‌సీలో ముఖ్య స‌భ్యుడిగా ఉంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌న‌క్క‌ర్లేదు అంటూ అన‌డం దుర్మార్గ‌పు చ‌ర్య అన్నారు. స్వ‌యాన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణే ఆ మా అన్నాడంటే ప‌వ‌న్ క‌ల్యాన్ అండ చూసుకునే క‌దా..? అంటూ ప్ర‌శ్నించారు క‌త్తి మ‌హేష్‌. స్వ‌యంగా జేఎఫ్‌సీ క‌మిటీలో ఉన్న జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణే అటు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని.. ఇటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని పొగుడుతుంటే.. ప‌క్క‌నే ఉన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ హర్షించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని ప్ర‌శ్నించారు.

 

 

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat