ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పేరిట ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పట్నుంచి ఇప్పటికీ విదేశాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు నిజంగానే విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చారా..? అమరావతిలో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీల్లో చంద్రబాబుకు సంబంధించినవి ఎన్ని..? చంద్రబాబు నాయుడు తన బినామీలతోనే అమరావతిలో పెట్టుబుడలు పెట్టిస్తున్నారా..? రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి లాక్కున్న భూములను చంద్రబాబు తన బినామీలకు కట్టబెడుతున్నారా..? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే, రాజకీయ విశ్లేషకుల అవుననే సమాధానికి కారణం లేకపోలేదు. అదేమిటో తెలుసుకుందాం..!!
చంద్రబాబు భారీ భూ కుంభకోణంలో భాగమన ఓ… జీవో నెం.330 (G.O.MS.No : 330) తేదీ 13/12/2016.
ఏపీ రాజధాని అభివృద్ధి కోసమంటూ సీఎం చంద్రబాబు తన బినామీ అయిన బీఆర్ శెట్టికి హాస్పిటల్ నిర్మాణం పేరుతో 100 ఎకరాల రైతుల భూమిని కట్టబెట్టారు. అయితే, జీవో 330తో ఎకరా రూ.5 కోట్లు విలువ చేసే అమరావతి భూమిని కేవలం ఎకరం రూ.5 లక్షల చెప్పున అమ్మేశారు. ఎంతైనా తన బినామీనే కదా..! అందుకే చరంద్రబాబు వాటాలు తరువాత పంచుకోవచ్చులే అన్న ఉద్దేశంతో 100 ఎకరాల భూమిని 500 కోట్లకు విక్రయించాల్సింది పోయి కేవలం 50 కోట్లకు విక్రయించి తన 40 ఏళ్ల అనుభవాన్ని ప్రదర్శించారంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వైఎస్ జగన్.. ఓ పెద్ద దద్దమ్మ..!!
జీవో నెం.330 ప్రకారం చంద్రబాబు ఆ నాడు మీడియాకు చెప్పిన మాటలు ఇవి.
బీఆర్ హాస్పిటల్స్ గ్రూప్ వారు ప్రభుత్వం కేటాయించిన వంద ఎకరాల భూముల్లో 2018 కల్లా హాస్పిటల్‌ను నిర్మించి ప్రజలకు సేవలందించాలని,
అలాగే, 2018 కల్లా త్రీ స్టార్ హోటల్ నిర్మాణం పూర్తి చేయాలని, 2019లో మెడికల్ యూనివర్సిటీ నిర్మించాలన్నది ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 330 యొక్క నిబంధనలు.
అయితే సీఎం చంద్రబాబు తేదీ 13/12/2016న చెప్పిన మాటల ప్రకారం హాస్పిటల్ పూర్తయిందా..? పోనీ త్రీ స్టార్ హోటల్..? మెడికల్ యూనివర్సిటీ అయినా పూర్తయిందా..? కనీసం నిర్మాణం కోసం పునాది రాయిని అయినా పాతారా..? అన్న విషయాలు దేవుడికే ఎరుక.