సీబీఐని, ఈడీని ఉతికారేసిన హైకోర్టు..! కారణం తెలిస్తే షాక్ ..!! అవును, సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులను హైకోర్టు ఉతికారేసింది. అయితే, నాడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌పై అప్పటి అధికార, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కై అక్రమంగా బనాయించిన కేసుల ఘటన దేశ వ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఒక్కొక్కటిగా వీగిపోతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తల ఫుల్ హ్యాప్పీలో ఉన్నారు.
అయితే, జగన్‌పై ఉన్న అక్రమ కేసుల్లో దోషిగా పేర్కొన్న ఐఏఎస్ మాజీ అధికారి, అప్పటి ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి మురళిధర్ రెడ్డి నిర్దోషిగా విడుదలైన విషయం తెలిసిందే. అంతేకాకుండా, వసంత ప్రాజెక్ట్స్ కు చెందిన 4.5 కోట్ల బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లను జప్తు చేస్తూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈడీ కేసుల నుంచి వసంత ప్రాజెక్టు డైరెక్టర్ వసంత కృష్ణ ప్రసాద్ నిర్దోషిగా పేర్కొనబడ్డాడు.
ఇదిలా ఉండగా , వైఎస్ జగన్‌పై నమోదైన 11 ఛార్జిషీట్లలో ఇప్పటికే తొమ్మిది వీగిపోగా.. మిగిలిన రెండు ఛార్జిషీట్లలో కూడా జగన్ నిర్దోషిగా, కడిగిన ముత్యంలా బయటకు రావడం ఖాయమని అటు న్యాయవాదులతోపాటు.. ఇటు సీబీఐ అధికారులే బాహాటంగా చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన వైసీపీ శ్రేణులు.. సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడన్నది ఎంత సత్యమో.. 2019లో జగన్ సీఎంగా బాధ్యతలు చేపడుతారన్నది కూడా అంతే సత్యమంటూ సంబురాల్లో మునిగి తేలుతున్నారు.
ఇదిలా ఉండగా. వైఎస్ జగన్‌పై రాజకీయ కక్షలతో అక్రమంగా బనాయించిన కేసుల్లో గతంలో ఈడీ, సీబీఐ అధికారులు కనబర్చిన అత్యుత్సాహాన్ని తప్పుబట్టింది. సరైన ఆధారాలు లేకుండా.. సాక్ష్యాలు లేకుండా కేసులు, ఛార్జీషీట్లు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నల వర్షం కురిపించింది. జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించి.. అభియోగాలతోనే ఛార్జిషీట్లు బనాయించి విచారణ పేరుతో హైకోర్టు సమయాన్ని వృథా చేయడం తగదని సీబీఐ, ఈడీ అధికారులకు హితవు పలికింది.