Home / ANDHRAPRADESH / వైసీపీలోకి వెండితెర అగ్ర న‌టుడు.. డేట్ ఫిక్స్‌..!!

వైసీపీలోకి వెండితెర అగ్ర న‌టుడు.. డేట్ ఫిక్స్‌..!!

తెలుగు సినీ ఇండ‌స్ర్టీకి చెందిన సీనియ‌ర్ న‌టుడు, వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు ఆ అగ్ర న‌టుడి రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇంత‌కీ ఆ అగ్ర న‌టుడు ఎవ‌ర‌నేగా మీ సందేహం. అత‌నే మంచు మోహ‌న్ బాబు.

అయితే, న‌టుడు మోహ‌న్‌బాబు, విష్ణు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం గాయ‌త్రి చిత్ర ఇటీవ‌ల విడుద‌లై ప్రేహ‌కు మ‌న్న‌న‌లు పొందిన విష‌యం తెలిసిందే. అయితే, గాయ‌త్రి మూవీలోని డైలాగ్స్ విన్న ప్ర‌తీ ఒక్క‌రు మంచు మోహ‌న్‌బాబు వైసీపీలో చేర‌బోతున్నార‌నే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఓ సారి ఆ డైలాగ్‌ల‌ను ప‌రిశీలిస్తే.. భూ సేక‌ర‌ణ అనేది రియ‌ల్ ఎస్టేట్ కోస‌మే.. (అయితే, చంద్ర‌బాబు రాజ‌ధాని కోసం భూమి ఇవ్వాలంటూ కోట్లు విలువ చేసే భూముల‌ను రైతుల‌ను బెదిరించి, మ‌భ్య‌పెట్టి, టీడీపీ నాయ‌కులే రౌడీల్లా వ్య‌వ‌హ‌రించి.. అమ‌రావ‌తి కోసం భూములు ఇవ్వాలంటూ రైతుల నుంచి.. భూములు లాక్కున్న విష‌యం తెలిసిందే.) మ‌రో డైలాగ్‌ను ప‌రిశీలిస్తే.. చంద్ర‌బాబు నంద్యాల ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా నేను వేసిన రోడ్లు, నేను ఇస్తున్న రేష‌న్ బియ్యం తింటూ నాకు ఓట్లేయ‌రా..? అంటూ ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తూ మాట్లాడిన మాట‌ల‌నుద్దేశించి మ‌రో డైలాగ్ ఉంది. అంతే కాకుండా, సినిమాను సైతం నిశితంగా ప‌రిశీలిస్తే నోటుకు ఓటు కేసుకు సంధించి కూడా ఓ డైలాగ్ ఉంద‌ని, ఆ డైలాగ్‌ను సెన్సార్ స‌భ్యులు తొల‌గించిన‌ట్లు స‌మాచారం. సెన్సార్ స‌భ్యులు తొల‌గించిన ఆ డైలాగ్ సీన్‌ను ఇట్టే ఈజీగా క‌నిపెట్టొచ్చు.

అంతేగాక‌, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలోనూ మోహ‌న్‌బాబు అధికార పార్టీ టీడీపీపై విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌జ‌లు ఎవ‌రికి ఓటేసింది..? ప‌లాన పార్టీ అని మీకు ఓటేస్తే..!! గెలిచిన త‌రువాత వేరే పార్టీలోకి వెళ్ల‌డం నీచ‌త్వం, నికృష్టం అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌నుద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన త‌రువాత ఆ పార్టీ ఇష్టం లేక‌పోతే రిజైన్ చెయ్యాలి. అంతేకానీ డ‌బ్బుపై మ‌మ‌కారం పెంచుకుని వేరే పార్టీలోకి వెళ్ల‌డం స‌రైంది కాదంటూ త‌న అభిప్రాయాన్ని చెప్పారు మంచు మోహ‌న్‌బాబు.

ఇదిలా ఉండ‌గా.. మంచు విష్ణు స‌తీమ‌ణి వైఎస్ ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన అమ్మాయి. ఆ పెళ్లి త‌రువాత మంచు మోహ‌న్ బాబు వైసీపీలో చేర‌డం క‌న్ఫాం అంటూ అప్ప‌ట్లో పెద్ద ప్ర‌చారమే జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చారు మోహ‌న్‌బాబు. అయితే, ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న రాజ‌కీయ ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలించిన మోహ‌న్‌బాబు వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యాడ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఇదిలా ఉండ‌గా.. ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. నిన్న కాక మొన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టగానే టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి దాదాపు మూడు వేలమంది తన భారీ అనుచవర్గంతో సహా వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే.

తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ పార్టీలో చేరాలని ముహూర్తం ఖరారు చేసుకున్నారు .అందులో భాగంగా ఈ నెల ఇరవై ఐదో తారీఖున తన అనుచవర్గంతో సహా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు .

అందుకు తగిన ఏర్పాట్ల గురించి మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ఆదివారం జరిగిన కార్యకర్తల ,అనుచరుల సమావేశంలో చర్చించారు .కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా వైసీపీలో చేరడం వలన ఆ పార్టీకి మంచి ఊపునిస్తుంది అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat