మే 1వ తేదీన కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు. మేడే సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన జగన్ పెడన నియోజకవర్గంలో జెండా ఆవిష్కరణ చేశారు. కాగా, జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 150వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరణాభిమానాలతో వైఎస్ జగన్ విజవంతంగా ముందుకు కదులుతున్నారు. అయితే, జగన్ పాదయాత్ర ఇవాళ పెడన నియోజకవర్గంలోని పర్ణశాల నుంచి ప్రారంభ మై చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపాళెం, మచిలీపట్నం, నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. అక్కడ్నుంచి సుల్తానగరం, మచిలీపట్నం వరకు జగన్ ప్రజా సంకల్ప యాత్ర 150వ రోజు కొనసాగనుంది. అనంతరం మచిలీపట్నంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర 150వ రోజు తమ నియోజకవర్గంలో కొనసాగడం ఆనందంగా ఉందని పెడన నియోజకవర్గ వాసులు తెలిపారు.
