అవును, టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వద్ద నుంచి టీడీపీ జెండాతోపాటు.. డబ్బులు దోచుకున్న గజదొంగ చంద్రబాబు నాయుడు అని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కాగా, ఇవాళ మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్ర పన్నారన్నారు. సీఎం చంద్రబాబు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కాపులకు రిజర్వేషన్ హామీని ఎప్పట్లోగా నెరవేరుస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తన పదువుల నుంచి వైదొలిగి ఎన్టీఆర్ వారసులకు అప్పగించాలన్నారు. సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఏ ఒక్క పేద టీడీపీ కార్యకర్తకైనా రాజ్య సభ సీటు ఇచ్చాడా.? అని మోత్కుపల్లి ప్రశ్నించాడు.