ఏపీలో టీడీపీ నేతలకు అధికారంలో ఉన్నామనే ఆహంకారంతో విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు చూస్తే నిజమే అని పిస్తుంది. తాజాగా యువతిని వేధింపులకు గురిచేస్తోన్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను ఏలూరులో పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. స్థానికంగా నివాసముంటున్న ఓ యువతిని ఫోన్‌లో బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధిస్తున్నాడు. ఈ వేధింపులకు తాళలేక ఆ యువతి, బంధువుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వేధింపులకు పాల్పడుతున్న టీడీపీ నేత ముసునూరి రామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. 354డీ, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
