ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరువును వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే అఖిలప్రియ గంగలో కలిపింది. కాగా, మంత్రి అఖిలప్రియ చేసిన ఈ పనికి తెలుగు భాషా పండితులు సైతం విస్తుపోతున్నారు. తెలుగు భాషపై మన రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపిస్తుందో.. ఈ ఒక్క సంఘటన చాలని విద్యావంతులు అంటున్నారు. అయితే, ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.
ఇక అసలు విషయానికొస్తే.. ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ ఒక బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. ఆ బ్యానర్‌లో కుడివైపు సీఎం చంద్రబాబు ఫోటో.. ఎడమవైపై మంత్రి అఖిలప్రియ ఫోటో ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. బ్యానర్‌పై ఉన్న అసలు మేటరుకే తంటాలు వచ్చిడింది. భాషా సాంస్కృతిక శాఖ అని ముద్రించాల్సింది పోయి.. బాసా సాంస్కృతికశాఖ ని ముద్రించారు. ఇలా భాషా బదులు.. భాసా అని ముద్రించి.. సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికారు.
ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న పలువురు భాషా పండితులు చంద్రబాబు సర్కార్‌పై పెదవి విరుస్తున్నారు. పక్క రాష్ట్రాలవారు భాషను కాపాడుకునేందుకు పోటీ పడుతుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. తెలుగును నామరూపాలు లేకుండా చేస్తోందని ఫైరవుతున్నారు.