2019 సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. ఏపీలో రాజకీయం వేడుక్కుతోంది. ప్రస్తుతం ప్రజల్లో ఆదరణ పొందిన పార్టీలో చేరేందుకు పలువురు సీనియర్ రాజకీయ నేతలు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా, టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కూడా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య సభ్యులతో సంప్రదింపులు చేస్తున్నారన్న వార్త తెలుగుదేశం నేతలకు నిద్ర లేకుండా చేస్తోందని తెలుస్తోంది.
అయితే, టీజీ వెంకటేష్ టీడీపీని వీడేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అని ఆ పార్టీ వారే చర్చించుకుంటున్నారు. అయితే, నారా లోకేష్ ఇటీవల కర్నూలు జిల్లా రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లాకు సంబంధించి 2019 ఎన్నిల్లో భాగంగా ఇప్పటికే ముగ్గురికి నారా లోకేష్ టిక్కెట్లను ఖరారు చేసిన విషయం తెలిసిందే. వీరిలో సిట్టింగ్ ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. మరోపక్క, 2019 ఎన్నికల్లో తమ కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఆశించిన ఎంపీ టీజీ వెంకటేష్‌కు భంగపాటు తప్పలేదు. అంతకు ముందే తమ కుమారుడికి టిక్కెట్ ఖరారు చేయాలని కోరినా.. ఆయన మాటను మంత్రి నారా లోకేష్ పెడ చెవిన పెట్టారనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, టీడీపీ అధిష్టానం సైతం ఈ విషయంపై స్పందించకపోవడంతో టీజీ వెంకటేష్ ఒకింత అసహనానికి గురై.. వైసీపీ నేతలతో టచ్‌లోకి వచ్చారని, వీరి మధ్య చర్చలు కూడా సఫలమవడంతో అతి త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో.. వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం.