చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా నిరంతరం సహాయక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే మరో సారి తన సమానవతా హృదయాన్ని చాటుకున్నారు ఎమ్మెల్యే రోజా. ఏ ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న తమను ఆదుకోవాలని వచ్చిన నిరు పేదలకు.. ఎమ్మెల్యే రోజా ఉపాధిమార్గం చూపించారు.
కాగా, ఇవాళ ఐదు మంది నిరుపేదలకు చిరు వ్యాపారం పెట్టుకునేలా ఐదు చెక్క బండ్లను పంపిణీ చేశారు. అయితే, ఎమ్మెల్యే రోజా తానే పూజా కార్యక్రమాలు చేసి ఆ నిరుపేదలకు అందజేయడం గమనార్హం. ఇలా నిత్యం సేవా కార్యక్రమాలతో నగరి నియోజకవర్గ ప్రజలకు మరింత చేరవవుతున్నారు ఎమ్మెల్యే రోజా.