జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి నాపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన స్ర్కిప్ట్‌ను పక్కాగా అమలు చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు. టీడీపీని, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలి వంటి సంస్కారంలేని భాషను పవన్ కళ్యాణ్ వాడుతుండటం బాధాకరం అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
కాగా, ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలు ధర్మపోరాట దీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో బలహీనతలు ఉన్న పవన్ కళ్యాణ్ తన గురించి తప్పుగా మాట్లాడుతుంటే చాలా బాధగా ఉందని చంద్రబాబు అన్నారు. నాకేమన్నా బలహీనతలు ఉన్నాయా..? నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు..! నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా సిగరేట్లు కాల్చానా..? మద్యం తాగానా..? అమ్మాయిలతో తిరిగానా..? నా గురించి ఇటువంటి వార్తలు ఎప్పుడైనా విన్నారా..? తమ్ముళ్లూ అంటూ ధర్మపోరాట దీక్షకు హాజరైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.