కాపు రిజర్వేషన్లపై ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం మాత్రమేనని ఒప్పుకున్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వరాదని సుప్రీం కోర్టు చెప్పినమాట వాస్తవమేనని, అంతకు మించి రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనని చెప్పారు. అసలు రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోకి రాదని, అందుకు తగ్గట్టు కేంద్రం మాత్రమే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని అన్నారు.
అయితే, కాపుల రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రజా సమస్యలపై పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వాస్తవ పరిస్థితులను వివరించిన దృష్ట్యా… టీడీపీ నేతలంతా ఆ మాటలను వక్రీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల కాపు రిజర్వేషన్ల గురించి జగన్ చెప్పిన మాటలనే మంత్రి యనమల రామకృష్ణుడు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ పునరావృతం చేశారు. కాగా, కాపు రిజర్వేషన్లకు సంబంధించి ఏం చేయబోతున్నారు అంటూ మీడియా ప్రశ్నించిన నేపథ్యంలో మంత్రి యనమల రామకృష్ణుడు పై విధంగా స్పందించారు.