నేటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర పోలీసుశాఖ ద్వారా గౌరవవందనాన్ని స్వీకరించారు వైఎస్ జగన్. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జగన్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత విధినిర్వహణలో సాహసాలు ప్రదర్శించిన ఆయా శాఖ పోలీస్ అధికారులకు సీఎం మెడల్స్ ప్రదానం చేశారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రులు, మరియు అధికారులు హాజరయ్యారు.
