ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పోలవరం..రాజధాని గురించి తమ ఆలోచనలు..జరుగుతున్న పరిణామాలను వివరించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం లో సమర్పించిన ఒక అఫిడవిట్ ను జగన్ ఆయుధంగా మలచుకుంటున్నారని తెలుస్తుంది. దీనినే చంద్రబాబు పైన రివర్స్ అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు వివరణ రూపంలో ఒక అఫిడవిట్ సమర్పించారు. అదే ఇప్పుడు జగన్ ఆయుధంగా మార్చుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం నాడుసమర్పించినఅఫిడవిట్ తో పాటుగా గ్రీన్ ట్రిబ్యునల్ అభ్యంతరాలను వివరిస్తూ జగన్ ప్రభుత్వం ప్రధానికి లేఖ రాసినట్లు సమాచారం. తాజాగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఇదే లేఖను ఇవ్వటంతో పాటుగారాజధానిపైనతమఉద్దేశం..పరిపాలనావికేంద్రీకరణ గురించి వివరించినట్లు విశ్వసనీయ సమాచారం.అమెరికా పర్యటన నుండి వచ్చిన తరువాత జగన్ ఏపీలో నెలకొన్ని పరిస్థితులు..పోలవరంతో పాటుగా రాజధాని పైన రాజకీయంగా సాగుతున్న రగడ పైన పూర్తి సమాచారం సేకరించారు. ఇదే సమయంలో పోలవరం గురించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యల పైన నేరుగా కేంద్రంతోనే చర్చించాలని జగన్ నిర్ణయించారు. హోం మంత్రి అమిత్ షాకు పోలవరం పైన వేసిన నిపుణుల కమిటీ ఇచ్చిన ప్రాధమిక నివేదిక ను అమిత్ షా కు వివరించారు. అదే విధంగా రాజధానిలో ముంపు ప్రాంతాలు ఉన్నాయని..అక్కడ నిర్మాణాలు చేపట్టాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నదని గత ప్రభుత్వం బయటకు చెప్పక పోయినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సమర్పించిన అఫిడవిట్ ను ప్రధానికి సైతం అందించిన విషయాన్ని వివరిస్తూనే..అమిత్ షాకు నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంల రాజధానిలో జరిగిన అవినీతి గురించి ముఖ్యమంత్రి వివరించారని చెబుతున్నారు. దీనికి సంబంధించి జరిగిన లావా దేవీలను సైతం ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అవినీతి జరిగి ఉంటే చర్యలు తీసుకోవాల్సిందేనని అమిత్ షా సైతం వ్యాఖ్యానించినట్లు సమాచారం.
