బీజేపీ లో చేరిన టీడీపీ మాజీ నేత, ఎమ్.పి సుజనా చౌదరి చక్రం తిప్పుతున్నట్లే ఉంది.ఆంధ్రప్రదేశ్ బీజేపీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలుపుకుని ఆయన రాజధానిలో పర్యటిస్తున్నారు. సుజనా చౌదరి రేపు రాజదాని గ్రామాలలో తిరుగుతారని, కన్నా కూడా పాల్గొంటారని టీడీపీ మీడియాలో విస్తారంగా వార్తలు వచ్చాయి.అయితే సహజంగానే ఈ టూర్ లో సుజనా కు ప్రాదాన్యం వస్తుంది .కన్నా లక్ష్మీనారాయణ తోడు పెళ్లికొడుకు మాదిరి ఉంటారా?సుజనా వెంట వెళ్లినట్లు వ్యవహరిస్తారా?స్వతంత్రంగా ఉంటారా అన్నది తెలియదు కాని కన్నా సొంతంగా వెళ్లకుండా సుజనాతో పాటు వెళ్లడం ద్వారా సుజనా మేనేజ్ మెంట్ స్కీమ్ మరోసారి బయట పడిందని అనుకోవచ్చు. మరోపక్క సీఎం రమేష్ కూడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అద్యక్షుడు పదవికి ఎసరుపెడున్నట్లు సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం జరుగుతంది. చంద్రబాబు స్కెచ్ లో బాగాంగ అప్పుడు విష్ణు కూమారు రాజుకు ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణకు చెక్ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇప్పటికే బీజేపీ లో టీడీపీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ సాగుతోంది.ఈ పరిణామం ఎలా ఉంటుందో చూడాలి.
