Home / ANDHRAPRADESH / చంద్రబాబు, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

చంద్రబాబు, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

ఏపీలో టీడీపీ ఘోర పరా.జయంపాలై 3 నెలలు కూడా కాకముందే…సీఎం జగన్‌పై, వైసీపీ ప్రభుత్వంపై, మంత్రులపై టీడీపీ విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్  రాజధానిని అమరావతి నుంచి తరలిస్తుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక రాజధానిలో ఇసుక కొరత అంటూ లోకేష్ నిన్న మంగళగిరిలో ఓ ధర్నా కార్యక్రమం చేపట్టాడు. ఈ సందర్భంగా ఇసుకాసురులు, భస్మాసురులు అంటూ సీఎం జగన్‌‌ను ఉద్దేశిస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించాడు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్‌లపై సైటైర్లు వేశారు….చిత్తు చిత్తుగా ఓడిపోయి 3 నెలలు కాలేదు. మిమ్మల్ని ఓడించిన ప్రజలు రాక్షసులా? ఏకపక్ష తీర్పుతో వారు విజయ తిలకం దిద్దిన వ్యక్తి భస్మారుడా? స్పృహలో ఉండే మాట్లాడుతున్నాడా? ఈ వయసులోనే మెదడులో చిప్ పాడైనట్లుంది. కాస్త రిపేర్ చేయించండి. కాబోయే పార్టీ అధ్యక్షుడు కదా? అంటూ విజయసాయిరెడ్డి చినబాబు లోకేష్‌పై వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పెంచి పోషించిన ఇసుక మాఫియా ఇప్పుడు కలుగులో నుంచి బయటపడ్డ ఎలుకలా కొట్టుకుంటోందని అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.

ఇక చంద్రబాబు గురించి మాట్లాడుతూ…రాజకీయాల్లో హింసా ప్రవృత్తికి ఆద్యుడు చంద్రబాబు గారే. ఆయన ఐదేళ్ల రాక్షస పాలనలో వందల మంది వైసీపీ నేతలు జైళ్ల పాలయ్యారు. వేల మందిని గ్రామాల నుంచి తరిమేశారు. 600 మందిని హత్య చేశారు. వృద్ధ జంబూకం శాంతి వచనాలు పలికినట్టు ఇప్పుడు వేధింపుల గురించి మాట్లాడుతున్నారు.  ఇక రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తినప్పటి నుంచి చంద్రబాబు గారు దెయ్యం పట్టిన వాడిలా మారిపోయారు.భూములపై వందల కోట్లు పెట్టుబడి పెట్టిన తన బినామీలు, బంధువర్గం పరిస్థితి ఏమవుతుందనే బెంగ పట్టుకుంది.ప్రతిపక్ష నేత అయి ఉండీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారు అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేశా చేశారు. ఇక రాజధానిపై రగడ చేస్తున్న టీడీపీ నేతలను ఉద్దేశిస్తూ… ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారు తండ్రీ కొడుకులు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయి. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే తెలుసు వాటికి. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారు. మొత్తంగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు, లోకేష్‌లపై విజయసాయిరెడ్డి వేసిన సెటైర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బాబు, లోకేష్‌ల బండారాన్ని బయటపెట్టడంలో విజయసాయిరెడ్డి తర్వాతే ఎవరైనా అంటూ నెట్‌జన్లు రియాక్ట్ అవుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat