ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మరణించినట్లు బ్రేకింగ్ న్యూస్‌లు వస్తున్నాయి. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక టీవీ ఛానల్ చెబుతుండగా…మరో ఛానల్ ఆయన గుండెపోటుతో మరణించినట్లు చెబుతోంది. ఈ రెండు మీడియా సంస్థలు టీడీపీకి అనుకులమైనవే. వాటిల్లోనే కోడెల మరణానికి సంబంధించి విభిన్న కథనాలు ప్రసారం చేయడం గమనార్హం. వరుసగా కేసుల్లో ఇరుక్కున కోడెల శివప్రసాద్‌రావు రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చింది. దాదాపు 15 కేసుల్లో ఆయనపై విచారణ జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు కేసులో రాజకీయంగా, నైతికంగా పతనమైన కోడెల గుండె సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. కాగా రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన కోడెలకు ఇవాళ గుండెపోటుకు కుప్పకూలారని, ఆయన్ని కుటుంబ సభ్యులు బసవతారకం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు ప్రాథమిక సమాచారం. డాక్టర్లు ఇంకా ఆయన మరణాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే మరొక టీవీ ఛానల్ కోడెల ఆత్మహత్యకు పాల్పడినట్లు బ్రేకింగ్ న్యూస్‌లు ఇస్తుంది. చంద్రబాబుకు అనుకూలమైన ఈ రెండు ఛానళ్లు విభిన్న వార్తలు ఇస్తుండడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. గుండెపోటు వస్తే ఇంటికి దగ్గరలోనే నిమ్స్, కేర్ హాస్పిటల్స్ ఉన్నాయి. అక్కడకు తీసుకువెళ్లకుండా కాన్సర్ ఆసుపత్రికి ఎందుకు తీసుకుపోయారనే అనుమానాలు తలెత్తుతున్నాయి. క్యాన్సర్ ఆసుపత్రికి చంద్రబాబు వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యకు చెందిన ఆసుపత్రి. అక్కడ క్యాన్సర్‌కు చికిత్స తప్పా…హార్ట్ ఎటాక్‌కు చికిత్స్ ఉండదు..అలాంటప్పుడు కోడెలను అక్కడికే తరలించడం వెనక మర్మమేంటో తెలియాల్సి ఉంది. ఒక వేళ కోడెల గుండె పోటుతో మరణిస్తే..దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి టీడీపీ రాజకీయం చేయదల్చుకుందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఒక వేళ నిజంగా ఆత్మహత్య చేసుకుంటే…క్యాన్సర్ ఆసుపత్రికి కాకుండా…దగ్గరలో ఉన్న నిమ్స్‌కో, కేర్ హాస్పిటల్‌కో తీసుకువెళ్లేవారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ కూడా వెంటనే వస్తుంది. అలా కాకుండా కోడెల సహజంగా గుండెపోటుతో మరణిస్తే తమ పార్టీకే చెందిన క్యాన్సర్ ఆసుపత్రికి తరలించి…. తప్పుడు పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ సృష్టించి…రాజకీయ వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారంటూ..టీడీపీ రాజకీయం చేయడానికి అవకాశం ఉంటుంది..ఇప్పటికే సత్తెనపల్లి, నరసరావుపేటలలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పోలీసులు 144 సెక్షన్ విధించేందుకు సిద్ధమవుతున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రకటిస్తే….గుంటూరు జిల్లాలో టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తంగా కోడెల మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి..వీటిపై ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
