ఆంధ్రజ్యోతి విలేఖరి సత్యనారాయణ దారుణ హత్య మా దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించి నిస్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతుందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. హత్య జరిగిన వెంటనే సమాచార శాఖ మంత్రిగా తాను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళానని దీనిపై జగన్ స్పందించారని అన్నారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని ఇప్పటికే డీజీపీని ఆదేశించారు. అంతేకాకుండా గంట గంటకి రిపోర్ట్ ఇవ్వమని డీజీపీని కోరారు.ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.హత్య చేసిన వారితో పాటు హత్య వెనుక ఉన్న వ్యక్తులను కూడా త్వరితగతిన గుర్తించి అరెస్ట్ చేస్తామని అన్నారు. సత్యనారాయణ ఏ పత్రికలో పని చేసినా అతనొక విలేఖరి అని కేసును నిస్పక్షపాతంగా, వేగవంతం దర్యాప్తుకు సీఎం ఆదేశాలు జారీ చేసారని అన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటాం,ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా నిందితులను శిక్షిస్తామని మంత్రి చెప్పారు.
