ఏపీలో సీఎం జగన్ ప్రజారంజక పాలనకు అన్ని వర్గాల ప్రజల జేజేలు కొడుతున్నా చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని, తప్పుడు నిర్ణయాలతో జగన్ రాష్ట్రాన్ని అధోగత పాల్జేస్తున్నారని, రాజధాని వెనక్కి పోయిందని, పెట్టుబడులు ఆగిపోయాయని దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో వైసీపీ ఏకంగా 151 సీట్లలో గెలిచినా, టీడీపీ కేవలం 23 సీట్లలో గెలిచినా…చంద్రబాబుకు కొమ్ము కాసే కొన్ని వర్గాల ప్రజలు జగన్ సీఎం అయితే మన పరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడ్డారు.వాళ్లు అనుకున్నారు..కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కంటే..4 నెలల్లోనే జగన్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు, తెలుగు తమ్ముళ్లు కూడా ఫిదా అయిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలోనే , కులం చూడం, మతం చూడం, వర్గం చూడం, ప్రాంతం చూడం, ముఖ్యంగా పార్టీలు చూడం..ప్రతి ఒక్కరికి నవరత్నాల పథకాలను అందిస్తానని జగన్ పదే పదే ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ మేరకు అధికారంలోకి రాగానే ప్రజా సంక్షేమ పథకాలను పార్టీలకతీతతంగా అమలు చేస్తున్నారు. తాజాగా వైయస్ఆర్ రైతు భరోసా కింద..ఆర్థిక సాయాన్ని గ్రామాల్లో టీడీపీ అనుకూల రైతులు కూడా అందుకున్నారు. గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేకుండా టీడీపీ సానుభూతిపరులైన రైతుల అకౌంట్లలో రైతు భరోసా సొమ్ము జమ అయింది. ఒక్క రైతు భరోసానే కాదు గ్రామసభల్లో పార్టీలకతీతంగా తెలుగు తమ్ముళ్లకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారు. దీంతో టీడీపీ సానుభూతిపరుల్లో పశ్చాతాప్తం మొదలైంది. జగన్ వస్తే రాయలసీమల నుంచి పంచెలు కట్టుకుని దిగుతారు.. రౌడీయిజం, ఫ్యాక్షనిజం పెరిగిపోతుందని చంద్రబాబు చేయించిన ప్రచారానికి, ఏ మాత్రం పొంతన లేకుండా, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండడంతో టీడీపీ సానుభూతిపరులైన రైతులు, వివిధ వర్గాల ప్రజలు ఆలోచనలో పడ్డారు. చంద్రబాబు హయాంలో ప్రజలను పీడించిన జన్మభూమి కమిటీలకు , ప్రస్తుతం ఎటువంటి పక్షపాతం లేకుండా పాదదర‌్శకంగా, నిబద్దతతో సాగుతున్న గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థను ప్రజలు పోల్చి చూస్తున్నారు. గతంలో ఇండ్ల పట్టాలు కాని, ఇండ్ల కేటాయింపులు కానీ, పింఛన్లు కానీ..ఇలా ఏ ప్రభుత్వ పథకం అందాలన్నా..ముందుగా జన్మభూమి కమిటీలకు వేలకు వేలు లంచం చెల్లించాల్సిందే. వెయ్యి రూపాయల పింఛన్‌కు వందరూపాయలు, ఇండ్ల నిర్మాణంలో పేరు నమోదుకు 50 వేలు ఇలా ప్రత పథకానికి టీడీపీ సానుభూతిపరులైన ప్రజలు కూడా జన్మభూమి కమిటీలకు లంచం చెల్లించాల్సి వచ్చింది.ఇక వైసీపీ అనుకూలంగా ఉండే వారికి అయితే ఒక్క పథకం కూడా అందేది కాదు. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయితే తమ పరిస్థితి ఎలా ఉంటుందో అని టీడీపీ సానుభూతిపరులు భయపడ్డారు. కానీ..జగన్ పాలనలో పార్టీలకతీతంగా రైతు భరోసాతో సహా అన్ని ప్రభుత్వ పథకాలు అందుతుండడంతో టీడీపీ అనుకూల వర్గం జనాలు, ఆఖరకు తెలుగు తమ్ముళ్లు కూడా జగన్‌ను దేవుడిలా చూస్తున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు కంటే..46 ఏళ్ల జగన్ ఎంతో పరిణితి కలిగిన నాయకుడని టీడీపీ సానుభూతిపరులు, తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు సీఎం జగన్‌ను టీడీపీ అనుకూల వర్గం ప్రజలు కూడా దేవుడిలా కొలుస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో.
