వివాదాస్పద టీడీపీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇవాళ మరోసారి అరెస్ట్ అయ్యారు. గత నెల రోజులుగా ఏలూరు జైల్లో రిమాండ్‌లో ఉన్న చింతమనేని పెండింగ్ కేసులలో వరుసగా అరెస్ట్ అవుతూ..జైలుకు వెళుతున్నాడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే చింతమనేనిపై చింతమనేనిపై 50 కు పైగా కేసులు నమోదు అయ్యాయి. అయితే చంద్రబాబు, లోకేష్‌ల అండతో ఆ కేసులపై విచారణ జరిపించకుండా చింతమనేని జాగ్రత్తపడ్డాడు. . ఇక ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో చింతమనేనిపై నమోదు అయిన కేసుల్లో విచారణ మొదలైంది. తొలుత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేనిని అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు ఆయన్ని జిల్లా జైలుకు తరలించారు. ఈ క్రమంలో రిమాండ్‌లో ఉండగానే వరుసగా ఆయనపై నమోదు అయిన 50 కు పైగా కేసుల్లో విచారణ జరపడం ప్రారంభించారు. ఒక కేసులో రిమాండ్ ముగియగానే..ఇంకో కేసులో ఆయన్ని కోర్ట్‌కు హాజరుపరుస్తున్నారు. న్యాయమూర్తులు విచారణ జరిపి 14 రోజుల రిమాండ్ విధిస్తున్నారు.దీంతో పోలీసులు ఆయన్ని తిరిగి జైలుకు తరలిస్తున్నారు. గత నెల రోజులుగా ఇదే తంతు నడుస్తోంది. ఇవాళ కూడా ఒక కేసులో రిమాండ్ ముగిసిన చింతమనేనిని పోలీసులు కోర్ట్‌లో హాజరు పర్చారు. ఈ సందర్భంగా ఆయనపై నమోదు అయిన మరో కేసును కోర్ట్ ముందు వచ్చారు. ఈ కేసును పరిశీలించిన కోర్ట్ ఆయనకు మళ్లీ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు మళ్లీ చింతమనేనిని జిల్లా జైలుకు తరలించారు. ఇప్పటికే చింతమనేనిపై 60 కు పైగా కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ కేసుల సంఖ్య త్వరలోనే సెంచరీ దాటేస్తుందని దెందులూరులో చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఈ దీపావళి పండుగనాడు చింతమనేని చెరసాలలో చీకట్లలోనే ఉండాల్సి వస్తోంది.
