ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో ప్రతిష్టాత్మక అంశంపై ముందడుగు వేశారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు జగన్ ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. తాజాగా ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఈ కామర్స్ వ్యాపారం లో దిగ్గజాలైన ఈ రెండు కంపెనీలు చేనేత వస్త్రాలను తమ తమ వెబ్సైట్లో పెట్టి అమ్మేందుకు ఏపీ ప్రభుత్వం తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంతే ఇక నుంచి చేనేత వస్త్రాలు ఆన్లైన్లో కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు జగన్ ప్రభుత్వం ఆ సదరు కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకుంది. నవంబర్ 1వ తేదీ నుంచి ఈ సౌలభ్యం ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాజు మంచివాడైతే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనడానికి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు వినూత్న ఆలోచనలతో యువ ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు అందరి మన్ననను పొందుతున్నాయి. ఆన్లైన్లోనూ వ్యాపారం పెరగడం వల్ల చేనేత కార్మికుల కష్టాలు తీరిపోయి ఉన్నాయని వారంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.
