రాజకీయంగా ఎంతటి శత్రువైనా రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉంటే వారిని గౌరవించడం సంప్రదాయం. అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రం ప్రత్యర్థి పార్టీల నాయకులు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నా సరే వారిపై బురద జల్లేందుకు…వారిపై వ్యక్తిగతం దూషింపజేసేందుకు కూడా వెనుకాడడని తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై తెలుగు దేశం ఆన్‌లైన్ దినపత్రిక రాసిన అనుచిత కథనం బట్టి అర్థమవుతోంది. నవంబర్ 11, సోమవారం ఎడిషన్‌లో నాడు పదవుల కోసం గుడ్డలూడదీసుకుంది మీరు కాదా అంటూ రాసిన ఓ కథనంలో తెలుగుదేశం దినపత్రిక స్పీకర్‌పై అసభ్యపదజాలంతో విషం చిమ్మింది. దున్నపోతులా సాంబారు తాగి వచ్చి అసెంబ్లీలో నిద్రపోతాడంటూ తమ్మినేనిపై సదరు టీడీపీ వెబ్‌సైట్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. 2001లో స్టాంపుల కుంభకోణంలో బర్తరఫ్ చేయద్దు అని అర్థరాత్రి చంద్రబాబు ఇంటి ముందు పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుంటా అని గుడ్డలూడదీసుకుంది ఎవరు భయ్యా..నీది బతుకేనా..అంటూ టీడీపీ వెబ్‌సైట్ దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అసలు చెప్పుకోలేని భాషలో, మడిచి ఎక్కడ పెట్టుకున్నావో..అసెంబ్లీలో సరిగా కూర్చోలేకపోతున్నావంటూ.. సదరు తెలుగుదేశం దినపత్రిక స్పీకర్‌ను బూతులతో కించపర్చింది. కాగా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఆన్‌లైన్ పత్రికపై, పోలీసులకు ఫిర్యాదు చేస్తామని వైసీపీ నేత జోగి రమేష్ తెలిపారు. ఈ కథనంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారిని వ్యక్తిగతంగా దూషించడం చంద్రబాబుకు, లోకేష్‌కు వెన్నతోపెట్టిన విద్య అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన వారు స్పీకర్ వంటి అత్యున్నత పదవుల్లో ఉంటే చంద్రబాబుకు నచ్చదని, అందుకే వారిని అవమానించేలా తన తోకపత్రికల్లో విషకథనాలు రాయించడం ఆయనకు అలవాటే అని వైసీపీ నేతలు అంటున్నారు. వెంటనే ఆ కథనాన్ని తొలగిస్తూ స్పీకర్‌కు తమ్మినేనికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా రాజ్యాంగబద్ధమైన స్పీకర్‌ను అగౌరవపరిచేలా తెలుగుదేశం వెబ్‌సైట్ రాసిన అనుచిత కథనం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది.