Home / ANDHRAPRADESH / బాబుగారి పరువు అడ్డంగా తీసిన ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్..!

బాబుగారి పరువు అడ్డంగా తీసిన ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు మతిపోయిందని, సింగపూర్‌కు వెళ్లి సరి చేయించుకోవాలని..ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 26న, ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్ పోలవరం ప్రాజెక్టు విషయంపై స్పందిస్తూ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.. పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్‌కు తమ ప్రభుత్వం వెళ్లిందని, తద్వారా ఏకంగా రూ. 830 కోట్ల ప్రజాధనం ఆదా అయిందని మంత్రి తెలిపారు. ఈనెల 21న ప్రాజెక్టు పనులను ప్రారంభించామని, 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి అనిల్‌ తెలిపారు. 2020 జూన్ నాటికి స్పిల్ వే పనులు కూడా పూర్తి చేస్తామని, అదేవిధంగా 18వేల కుటుంబాలను ప్రాజెక్టు ముంపు ప్రాంతం నుంచి తరలిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మతిపోయిందని, ఆయనెవరో ఏదో సినిమా తీస్తే ఈయనకు భయం పట్టుకుందని, కమ్మరాజ్యం కడపరెడ్లు సిన్మాను ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సింగపూర్‌కు వెళ్లి మతి సరిచేయించుకోవాలని అనిల్ సలహా ఇచ్చారు. ఇక రివర్స్ టెండరింగ్‌ కాదు..అది జగన్ రిజర్వ్ టెండరింగ్ అన్న టీడీపీ నేతల వ్యాఖ్యలను మంత్రి తిప్పికొట్టారు. తాము చేపట్టింది రిజర్వ్ టెండరింగ్ కాదని, రివర్స్ టెండరింగే అని స్పష్టం చేశారు.. రివర్స్‌ టెండరింగ్‌లో పాల్గొనేందుకు నవయుగ సంస్థకు అవకాశం ఇచ్చినా వారు రాలేదని వివరించారు. ఇన్ని వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నా టీడీపీ నేతల వంకర బుద్ది మారదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందంటూ..దేవినేని ఉమా లాంటి నేతల విమర్శలకు మంత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. ప్రాజెక్టు పనులు జరగవని ఏవేవో మాట్లాడిన వారికిప్పుడు..పనులు మొదలవడంతో రక్త కన్నీరు కారుతోందని చురకలు అంటించారు. డిసెంబర్ 21 నుంచి ప్రాజెక్టు పనులు మరింత వేగం చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వ నిర్వాకంతో ఆ పార్టీ 23 స్థానాలకు దిగిందని, తమ నాయకుడు చెప్పాడు కాబట్టి ఆగాం కాని.. తాము గేట్లు ఎత్తితే టీడీపీలో ఇద్దరో ముగ్గురో మిగులుతారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై నమ్మకం లేక టీడీపీ నేతల్లో కొందరు ఇప్పటికే బీజేపీవైపు చూస్తున్నారని మంత్రి అనిల్ అన్నారు. మొత్తంగా చంద్రబాబుకు మంత్రి అనిల్‌ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat