ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప గడ్డపై టీడీపీ అధినేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది..నవంబర్ 26, మంగళవారం నాడు కడపలో చంద్రబాబు టీడీపీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు తమ సమస్యలను బాబు ముందు ఏకరువు పెట్టారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమను ఎవరూ పట్టించుకోలేదని వారు బాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తమ పట్ల నిర్లక్ష్యంగా వహించారని, అనుచరులకే పెద్ద పీట వేసి, తమను తొక్కేసారంటూ బాబుకు చెప్పుకున్నారు. దీంతో వారిపై అక్కడే ఉన్న శ్రీనివాసరెడ్డి అనుచరులు దాడిచేసి కొట్టారు. ఈ కొట్లాటతో సమావేశంలో గందగోళం చోటు చేసుకుంది. తన కళ్ల ముందే కొట్టుకుంటున్న కార్యకర్తలను చంద్రబాబు వారించినా ఫలితం లేకుండా పోయింది. దళితులు అయినందుకే తమను అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని..ఇప్పుడు చంద్రబాబు ముందే దాడి చేశారని బాధిత కార్యకర్తలు వాపోయారు. మొత్తంగా పార్టీ అధ్యక్షుడు అయిన తన కళ్లముందే జరిగిన ఈ ఘటనతో చంద్రబాబుకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
కడపలో చంద్రబాబు ముందే కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు..వీడియో వైరల్..!
కడపలో చంద్రబాబు ముందే కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు..వీడియో వైరల్..! #dharuvutv
Posted by Dharuvu on Tuesday, 26 November 2019