అమరావతిపర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై కొందరు రైతులు చేసిన దాడి రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను టార్గెట్ చేస్తూ…తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇప్పటికే చంద్రబాబుపై రాళ్లు, చెప్పులతోనే కాదు పోలీసుల లాఠీలతో దాడి చేశారంటూ అచ్చెన్నాయుడు ఆరోపించాడు. తాజగా మరో సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి బాబు కాన్వాయ్‌పై జరిగిన దాడిపై తనదైన స్టైల్లో పెద్ద గొంతేసుకుని ప్రెస్‌మీట్ పెట్టాడు. రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలకు తప్ప, ఎవరికీ రక్షణ లేదని..సోమిరెడ్డి సోది చెప్పాడు. మా బాసు చంద్రబాబు అమరావతి పర్యటనకు ప్రభుత్వం ఎందుకు భద్రత కల్పించలేదని ప్రశ్నించాడు. . దాడులు చేస్తామని వైసీపీ ప్రకటించినా అదుపు చేయలేకపోయారంటూ పోలీసులపై విరుచుకుపడ్డాడు. మా నాయకుడు చంద్రబాబుపై రాళ్లు, లాఠీలు, చెప్పులతో చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేస్తే.. నష్టపోయిన వారు చేశారని.. వారికి ఆ హక్కు ఉందని డీజీపీ అనడం దారుణమని సోమిరెడ్డి సన్నాయినొక్కులు నొక్కాడు. బాబు వల్ల నష్టపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆయనపై రాళ్లు విసిరాడని డీజీపీ సవాంగ్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ అమరావతి రైతులు, రియల్టర్లు నష్టపోవడానికి కారణమెవరని ప్రశ్నించారు. చంద్రబాబు రాజధానిని అభివృద్ధి చేసి ఆస్తుల విలువ పెంచారంటూ తెగ ఆయాసపడ్డాడు. సోమిరెడ్డి వ్యాఖ్యలపై నెట్‌జన్లు కౌంటర్లు వేస్తున్నారు. సోమిరెడ్డి ఆపవయ్య నీ సోది..పోయి పోయి డీజీపీ మీద, పోలీసుల మీద పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను వాడుకుని జగన్‌ను ఎలా వేధించారో నీకు గుర్తులేదా..ప్రత్యేక హోదా కోసం వైజాగ్ వెళితే..విమానం దిగగానే పోలీసులతో అరెస్ట్ చేయించలేదా..అయినా జగన్ మీకు లాగా కాదు.. మీకులాగే అనుకుంటే..అమరావతిలో నడిరోడ్డు మీద కూర్చొబెట్టించేవాడు…అసలు మీ బాబుగారి పర్యటనను అడ్డుకోవాలనుకుంటే డీజీపీ పర్మిషనే ఇచ్చేవారు కాదు..అసలు నిన్న పోలీసులే లేకుంటే..నిన్న బాబుగారికి అమరావతి రైతుల చేతిలో బడిత పూజ జరిగేది..అది తప్పింది సంతోషించు..అంతేగాని పోలీసుల ముందు మీ పప్పులు ఉడకడం లేదని…ఓ తెగ నోరుపారేసుకోకు…అసలే ఫోర్టరీ కేసులో ఇరుక్కున్నావ్..ఛాన్స్ దొరికితే కుళ్లబొడుస్తారంటూ సోమిరెడ్డిపై నెట్‌జన్లు ఓ రేంజ్లో సెటైర్లు వేస్తున్నారు.
